ట్రంప్ మా కాంగ్రెస్ పథకాలను కాపీ కొడుతున్నాడు..డీకే శివ కుమార్….

ట్రంప్ మా కాంగ్రెస్ పథకాలను కాపీ కొడుతున్నాడ..

కాంగ్రెస్ పథకాలు విశ్వానికే ఆదర్శం అంటున్న డీకే శివ కుమార్..

రిపబ్లికన్స్‌ను గెలిపిస్తే ప్రతీ పౌరుడికి 5 వేల డాలర్లు ఇస్తామని ట్రంప్ ప్రకటించిన పథకం కాంగ్రెస్ పార్టీని చూసే కాపీ కొట్టారని పేర్కొన్న కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివ కుమార్..

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ గ్యారెంటీ పథకాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రజాదరణ పొందాయని, చివరికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా తమ పథకాలనే కాపీ కొడుతున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన, తమ ప్రభుత్వ గ్యారెంటీ పథకాలు బ్లాక్‌బస్టర్ విజయం సాధించాయని అన్నారు..
నవంబర్‌లో జరిగే అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లు గెలిచి కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనెట్‌లపై ఆధిపత్యం సాధిస్తే ప్రతి వయోజన అమెరికన్‌కు 5,000 డాలర్ల చొప్పున ‘డివిడెండ్’ ఇస్తామని ట్రంప్ ప్రకటించడాన్ని డీకే శివకుమార్ ఈ సందర్భంగా ప్రస్తావించారు..గతంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ వంటి రాష్ట్రాలు తమ కర్ణాటక మోడల్‌ను అనుసరించాయని, ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇదే తరహా సంక్షేమ హామీలను ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ సిద్ధాంతాలకు, భారత రాజ్యాంగ విలువలకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు అని ఆయన అభివర్ణించారు..