యుద్ధ విమానాలు శత్రువుల క్షిపణి దాడికి గురై కూలిపోతే ఆ పైలట్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించలేం.అలాంటి ఘటనే అమెరికా వైమానిక దళానికి చెందిన ఒక అధికారి జీవితంలో చోటు చేసుకుంది. శత్రు దేశమైన ఇరాన్ గగనతలంలో ఫైటర్ జెట్ కూలిపోవడంతో, ఒక అమెరికన్ పైలట్ తీవ్ర గాయాలతో శత్రువుల కంటపడకుండా ఏకంగా 50 గంటల పాటు తలదాచుకున్నాడు. అతన్ని రక్షించేందుకు అమెరికా సైన్యం అత్యంత ప్రమాదకరమైన సాహస యాత్రను చేపట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
సీఐఏ మాస్టర్ ప్లాన్:
అయితే, చివరకు ఎలాగోలా బ్రావో అమెరికా సైన్యానికి మెసేజ్ చేరవేశాడు. నిజానికి బ్రావో దాక్కున్న పర్వతానికి సమీపంలోనే ఇరాన్ సైన్యం ఉన్నట్లు అమెరికా గుర్తించింది. అతడిని రక్షించేందుకు అమెరికా టీమ్‌ను పంపడానికి ముందు అమెరికా బాంబర్లు, డ్రోన్లు అక్కడ ఉన్న ఇరాన్ సైన్యంపై దాడి చేసినట్లు వార్త కథనాలు వెలువడ్డాయి.
ఈ మొత్తంలో అమెరికా ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ఏజెన్సీ సీఐఏ కీలక పాత్ర పోషించింది. ఇరాన్ బలగాలను గందరగోళానికి గురిచేసేలా డిసెప్షన్ ఆపరేషన్ నిర్వహించడంతో పాటు కూలిపోయిన విమానంలోని సైనిక అధికారి ఆచూకీ గుర్తించేందుకు రహస్య సాంకేతికతను ఉపయోగించారు. దాదాపుగా 50 గంటల పాటు సాగిన గాలింపు తర్వాత బ్రావోను సురక్షితంగా రెస్క్యూ చేశారు.
ఇరాన్లో కూలిన F-15E ఫైటర్ జెట్
గత ఏడాది ఏప్రిల్ నెలలో అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగల్ ఫైటర్ జెట్ ఇరాన్ గగనతలంలో మిషన్ నిర్వహిస్తున్న సమయంలో క్షిపణి దాడికి గురైంది. ఈ విమానంలో ఇద్దరు సిబ్బంది ఉండగా, వారిని అల్ఫా, బ్రావో అనే కోడ్ నేమ్స్‌తో పిలిచారు. క్షిపణి దెబ్బకు విమానం కుప్పకూలడంతో ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో పారాచూట్ల ద్వారా కిందికి దూకారు. ఇందులో అల్ఫాను అమెరికా సైన్యం కేవలం ఆరు గంటల్లోనే రక్షించగలిగింది.
తీవ్ర గాయాలతోనే సాహస ప్రయాణం
కానీ బ్రావో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. పారాచూట్ సరిగ్గా తెరుచుకోకపోవడంతో ఆయన నేరుగా కఠినమైన భూభాగంపై పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన చేయి, భుజం విరిగిపోవడంతో పాటు తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. చుట్టూ ఇరాన్ సైన్యం, సాయుధ బలగాలు ఆయన కోసం గాలిస్తున్నాయి. అయినప్పటికీ ధైర్యం కోల్పోని బ్రావో, ఆ ప్రదేశం నుంచి సుమారు 7 వేల అడుగుల ఎత్తైన కొండ ప్రాంతానికి చేరుకుని తనను తాను రక్షించుకుంటూ అమెరికా సైన్యానికి సమాచారం అందించాడు.
అమెరికా సైన్యం భారీ రెస్క్యూ ఆపరేషన్
బ్రావోను కాపాడేందుకు అమెరికా అత్యంత ప్రమాదకరమైన రెస్క్యూ ఆపరేషన్‌ను ప్లాన్ చేసింది. ఈ మిషన్‌లో ఏకంగా 21 విమానాలు, 2 హెలికాప్టర్లు, 90 మందికి పైగా ప్రత్యేక కమాండోలు పాల్గొన్నారు. ఇరాన్ దళాల నుంచి ఎదురు కాల్పులు ఎదురైనప్పటికీ, సీఐఏ సహకారంతో బ్రావో ఖచ్చితమైన లొకేషన్‌ను కనిపెట్టారు. శత్రువులను తప్పుదోవ పట్టించే వ్యూహాలతో అమెరికా సైన్యం ఇరాన్ భూభాగంలోకి అడుగుపెట్టింది. సుమారు 1980 తర్వాత అమెరికా సైనికులు ఇరాన్ భూమిపై కాలుమోపడం ఇదే మొదటిసారి కావడం విశేషం..
అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానాన్ని గతవారం ఇరాన్ కూల్చేయగా.. అందులో ఒక పైలట్, ఒక ఆయుధ వ్యవస్థ అధికారి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో పైలట్‌ను అమెరికా సైన్యం ముందు రక్షించగా.. ఆయుధ వ్యవస్థ అధికారి ఆఫీసర్ జాడ మాత్రం గల్లంతైంది. వెపన్స్ సిస్టమ్స్ అధికారి జాడ కోసం అమెరికా భారీ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. కఠినమైన కొండల్లో జరిగిన ఈ సాహసోపేతమైన ఆపరేషన్ విజయవంతం కాగా.. శత్రు భూభాగం నుంచి తమ అధికారిని అమెరికా సురక్షితంగా తీసుకెళ్లింది. కూలిన అనంతరం ఇరాన్ బలగాలకు చిక్కకుండా అతడు పర్వతాలపైకి చేరి ఓ కొండ మధ్యలోని పగులులో దాక్కొన్నాడు. ఆ అధికారి ఆచూకీని సీఐఏ సాయంతో గుర్తించిన సైన్యం.. ‘సీల్ టీమ్ 6’ను ఆపరేషన్ కోసం రంగంలోకి దించింది. అయితే, ఈ ఆపరేషన్ కోసం దాదాపు అర బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.4,645 కోట్లు ఖర్చయినట్టు అంచనా.
సురక్షిత ప్రాంతానికి చేరిక
శత్రువుల కనుగప్పిన అమెరికన్ రెస్క్యూ టీమ్, దాదాపు 50 గంటల పాటు శత్రువుల వలయంలో ఉన్న బ్రావోను ఎట్టకేలకు సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. అయితే ఆపరేషన్ ముగిసిన తర్వాత రెస్క్యూ కోసం వాడిన విమానాలు అక్కడే చిక్కుకుపోవడంతో, శత్రువులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దక్కకుండా అమెరికా ఆ విమానాలను అక్కడే ధ్వంసం చేసింది. ఈ సాహసయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు, వీడియో నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చి ప్రపంచాన్ని విస్మయపరిచాయి.