ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్ను కలిసిన UAE డిప్యూటీ PM.. ప్రశంసల వర్షం!
ఫ్లై దుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ను UAE డిప్యూటీ ప్రధాని, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆస్పత్రిలో కలిశారు. విమానంలో జరిగిన ఘటన సమయంలో స్మిత్ మచ్ఛర్ చూపిన ధైర్యం, బాధ్యత, మానవ ప్రాణాల పట్ల శ్రద్ధను ఆయన ప్రశంసించారు. UAE నాయకత్వం తరఫున స్మిత్కు పూర్తి అభినందనలు, ప్రశంసలు ఉన్నాయని తెలిపారు.