రోడ్డు భద్రతకు 40 బారికేడ్లును వెల్లంకి శంకర్‌రావు అందజేత. ..

రోడ్డు భద్రతకు 40 బారికేడ్లు అందజేత..

వెల్లంకి శంకర్‌రావు 800000 లక్షల రూపాయల ఆర్థిక సహకారంతో పోలీస్ శాఖకు బారికేడ్లు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి ఎమ్మెల్యే బాలు నాయక్

చింతపల్లి……..
రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు వాహనదారులు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెళ్ళంకి ఫుడ్స్ అధినేత వెళ్ళంకి శంకర్‌రావు 800000 లక్షల రూపాయల తన సొంత ఆర్థిక సహకారంతో దేవరకొండ పోలీస్ శాఖకు 40 రోడ్డు భద్రత బారికేడ్లను తయారు చేయించి అందజేశారు. చింతపల్లి మండలం తీదేడు గేటు వద్ద ఉన్న వెల్లంకి ఫుడ్స్ వ్యవసాయ క్షేత్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో బారికేడ్లను పోలీస్ శాఖకు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బారికేడ్లను పరిశీలించి, ప్రజల భద్రత కోసం తన వంతు సహకారం అందించిన దాత వెల్లంకి శంకర్‌రావును అభినందించారు.
ప్రమాదాల నివారణకు బారికేడ్లు ఎంతో ఉపయోగకరం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. హైదరాబాద్–నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై రాకపోకలు అధికంగా ఉంటాయని, ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో
ఈ బారికేడ్లను ఏర్పాటు చేయడం ద్వారా వాహనాల వేగాన్ని నియంత్రించడంతో పాటు రహదారి భద్రతను మెరుగుపరచవచ్చని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఇటువంటి సామాజిక కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
రోడ్డు భద్రత విషయంలో ప్రజలు, వాహనదారులు కూడా పోలీస్ శాఖకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, అతివేగానికి దూరంగా ఉండటం, రాత్రివేళల్లో జాగ్రత్తగా ప్రయాణించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు కూడా సహకారం
దాత వెల్లంకి శంకర్‌రావు మాట్లాడుతూ.. రోడ్డు భద్రతతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. భవిష్యత్తులో అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసేందుకు సహకరిస్తానని చెప్పారు.
ఒక సీసీ కెమెరా ద్వారా అనేక ప్రాంతాల్లో నిఘా కొనసాగించవచ్చని, నేరాల నియంత్రణతో పాటు ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాలను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయని అన్నారు. పోలీస్ శాఖకు ప్రజల సహకారం ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.
శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల కృషి అభినందనీయం
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. రహదారులపై బారికేడ్ల ఏర్పాటు వల్ల ట్రాఫిక్ నియంత్రణ మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ప్రజల భద్రత కోసం ముందుకు వచ్చి 40 బారికేడ్లను అందించిన వెల్లంకి శంకర్‌రావు సేవాభావాన్ని ఎమ్మెల్యే బాలు నాయక్‌తో పాటు పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు,కొండమల్లేపల్లి సీఐ నవీన్ కుమార్ దేవరకొండ సీఐ వెంకట్ రెడ్డి, కొండమల్లేపల్లి ఎస్‌ఐ రమేష్, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి,తీదేడు మాజీ సర్పంచ్ కాయితి జితేందర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జటావత్ హరి నాయక్, మాజీ ఎంపీపీ కొండూరు పవన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల వెంకటయ్య గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు అంగిరేకుల నాగభూషణం, , చందంపేట మండల అధ్యక్షుడు దొండేటి మల్లా రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షడు కిన్నెర హరికృష్ణ, V P O విజయ్ ,కార్యదర్శి లు :కిరణ్ కుమార్, చంద్రశేఖర్, కసారపు శ్రీను, గునమోని కొండల్, నర్సింహారెడ్డి, నవీన్, రామవత్ హనుమ నాయక్,భగ్గు, శివర్ల శంకర్ యాదవ్, గునమోని శ్రీనివాస్, కలగొని రాజశేఖర్, కొరివి యాదగిరి, మర్రు మీనా రావు, పల్లెటి నర్సింహ, సందే లక్ష్మయ్య, రాశిక వెంకటేష్, గునమోని అంజయ్య, తిరుపతి, బసు, శ్రీను,మధు,మహేష్,హరి,పంతు,శ్రీరాములు,శంకర్,శ్రీశైలం,రామకృష్ణ, జంగయ్య,వెంకటనర్సింహ రెడ్డి,రమేష్,ఫుల్ సింగ్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.