అమ్మవారికి ఒడిబియ్యం కార్యక్రమం…

అమ్మవారికి ఒడిబియ్యం కార్యక్రమం

దేవరకొండ……
దేవరకొండ వాసవి మహిళలు చింతపల్లి మండలం వింజమూరు దగ్గర హరి హర క్షేత్రం లోని వెంకటేశ్వర స్వామి సమేత గోదాదేవి కి ఒడిబియ్యం సమర్పించినారు.
ఆలంపల్లి దీపిక ఆధ్వర్యంలో అమ్మవారికి వాసవి మహిళలు ఒక గ్రూపుగా ఏర్పడి అమ్మవారి కి ప్రతినెల అమ్మవార్లకు ఒడిబియ్యం పోసే కార్యక్రమం లో భాగంగా నాళ్ళ రవీందర్ రజిత దంపతులు హరిహర క్షేత్రం లో ఒడిబియ్యం కార్యక్రమం నిర్వహించినారు.
ఆలంపల్లి దీపిక మాట్లాడుతూ అమ్మవార్లకు ఒడిబియ్యం పోసే కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాకు ఆ తల్లికి ఒడిబియ్యం పోసే అదృష్టం మా గ్రూప్ కు వచ్చినందుకు మా గ్రూపు సభ్యులు అందరం చాలా సంతోషం ఆనందంగా ఉన్నదని అని తెలియజేసినారు. అందరూ బాగుండాలి దాంట్లో మా గ్రూప్ సభ్యుల ఫ్యామిలీలు అందరం సంతోషంగా ఉండాలని కోరుతున్నాము అని తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో నాళ్ల రవీందర్ రజిత దంపతులు , నాళ్ళ రూప,నీల సంధ్యారాణి, సముద్రాల సత్య శ్రీవాణి,ఆలంపల్లి దీపిక, పసుపుల ధనలక్ష్మి,నూనె శ్రీవిద్య, షీలా స్వప్న తదితరులు పాల్గొన్నారు.