హైదారాబాద్ లోని ఈడి ఆఫీసులో విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్..
భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు
ఈడి ఆఫీసు వద్ద బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణుల అరెస్టు..
భారీగా మోహరించిన పోలీసులు…
అంతకు ముందు..ఈ ఫార్ములా రేస్ కు సంబంధించి ఎక్స్ లో కేటీఆర్ పోస్ట్..!
దేశంలో, రాష్ట్రంలో.. ఫార్ములా ఈని హోస్ట్ చేయడం నాడు మంత్రిగా నా అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలలో ఒకటి.
అంతర్జాతీయ రేసర్లు, ఇ-మొబిలిటీ పరిశ్రమ నాయకులు మా నగరాన్ని ప్రశంసించడం గర్వించదగ్గ విషయం.
పనికిమాలిన కేసులు, చౌకగా బురదజల్లడం, రాజకీయాలు చేయడం ద్వారా ఆ మంచిపనిని తొలగించలేరు.
నాకు, బ్రాండ్ హైదరాబాద్ అత్యంత ముఖ్యమైనది.. నిన్న, నేడు, రేపు మరియు ఎల్లప్పుడూ ఫార్ములా ఈ మన నగరాన్ని అంతర్జాతీయ క్రీడా వేదికపై నిలబెట్టింది..