వాటే టెస్టు మ్యాచ్.. ఓవల్ లో ఇంగ్లాండ్ పై అద్భుత విజయం…!

England ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా అద్భుతమైన విజయంతో ముగించింది. ఉత్కంఠకే ఊపిరి అందని రీతిలో సాగిన ఆఖరి టెస్ట్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది..339/6 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌.. 367 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్ సిరాజ్(5/104) ఐదు వికెట్లతో భారత్‌కు చిరస్మరణీ వియాజయాన్నందించాడు. ఈ గెలుపుతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ 2-2తో సమంగా నిలిచింది. ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌ చరిత్రలోనే ది బెస్ట్‌గా నిలిచింది.

ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను జెమీ ఓవర్టన్ రెండు బౌండరీలతో దూకుడుగా ప్రారంభించాడు. కానీ సిరాజ్.. జెమీ స్మిత్(2)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి భారత శిభిరంలో ఆశలు రేకెత్తించాడు. తన మరుసటి ఓవర్‌లో దూకుడుగా ఆడుతున్న జెమీ ఓవర్టన్(9)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. జోష్ టంగ్(0)ను స్టన్నింగ్ యార్కర్‌తో ప్రసిధ్ కృష్ణ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారగా.. జట్టు క్రిస్ వోక్స్ బ్యాటింగ్‌కు దిగాడు.

ఒంటి చేత్తోనే బ్యాటింగ్ చేసేందుకు సాహనం చేశాడు. వోక్స్ సాయంతో అట్కిన్సన్ జట్టు విజయం కోసం పోరాడాడు. సిరాజ్ బౌలింగ్‌లో అతను భారీ షాట్ కొట్టగా.. బౌండరీ లైన్‌పై ఆకష్ దీప్ క్యాచ్ డ్రాప్ చేశాడు. దాంతో అది సిక్సర్‌గా మారింది. ఆ తర్వాతి మూడు బంతులను డాట్ అవ్వగా.. ఆఖరి బంతికి బై రూపంలో సింగిల్ వచ్చింది. దాంతో మళ్లీ అట్కిన్సన్ స్ట్రైకింగ్‌లోకి వచ్చాడు.

ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో అట్కిన్సన్ మూడు పరుగులు చేసి మళ్లీ స్ట్రైక్ తీసుకున్నాడు. కానీ సిరాజ్.. అట్కిన్సన్‌ను క్లీన్ బౌల్డ్ చేసి భారత విజయాన్ని లాంఛనం చేశాడు.

24 ఏళ్ల కిందట చివరి విజయం..

ఓవల్ మైదానంలో ఇది భారత్ ఆడుతున్న 16వ టెస్ట్ మ్యాచ్ ఇది. ఒకవేళ వారు ఇంగ్లండ్ను ఓడిస్తే, ఇది టీమ్ ఇండియాకు ఈ వేదికలో 3వ టెస్ట్ మ్యాచ్ విజయం అవుతుంది. ఇంతకుముందు భారత్ 1971, 2021లో విజయాలు సాధించింది. భారత్ ఇక్కడ నెగ్గి 24 ఏళ్లు కావొస్తుంది. అయితే ఓవల్ స్టేడియంలో హయ్యస్ట్ ఛేజింగ్ కంటే వంద పరుగుల కంటే ఎక్కువ టార్గెట్ ఇవ్వడంతో భారత్ శిబిరంలో ఆశలు చిగురించాయి..