మమ్మల్ని భయపెట్టడం మీ అబ్బ తరం కూడా కాదు
ఈ ప్రజలు తిరుగుబాటు మొదలుపెడితే.. ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఊర్లోకి రాలేరు
ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నాను..
అన్ని నియోజకవర్గాలు తిరిగి కరెంటు పరిస్థితి, నీళ్ల పరిస్థితి అడుగుదాం రండి
వెంటనే అన్ని విద్యుత్ యూనిట్లు ప్రారంభించి.. రైతులకు 24 గంటల కరెంటు అందుబాటులోకి తేవాలి..
నీళ్లు కూడా వదిలి ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.
మేము ఎండిపోయిన పొలాల చుట్టూ, రైతుల చుట్టూ తిరుగుతుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మా ఆస్తుల చుట్టూ తిరుగుతున్నారు
సూర్యాపేటలో ఎండిపోయిన పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
మాకు కరెంటు, నీళ్లు కావాలని తమ బాధను చెప్పుకున్న రైతులు..
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.
కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద నీళ్లు కిందికి పోతున్నాయి.. నీళ్లు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయడం లేదు
మీకు చేతకాకపోతే మాకు అప్పగించండి, ప్రాజెక్టులకు ఏం జరిగినా మాదే బాధ్యత.. రైతులకు మేము నీళ్లు ఇస్తామని కేటీఆర్ ఈ ప్రభుత్వాన్ని కోరాడు
అయినా కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు.. ఈరోజు పంటలు ఎండిపోతున్నాయంటే దానికి కారణం ఈ ప్రభుత్వం
నాగార్జున సాగర్, శ్రీశైలం నుండి చంద్రబాబు నాయుడు నీళ్లు తీసుకెళ్తుంది కళ్ల ముందు కనిపించినా రేవంత్ రెడ్డి అడ్డుకోవడం లేదు
కాంగ్రెస్ నాయకులు ప్రజల భూములు లాక్కోవడంలో బిజీగా ఉన్నారు తప్ప రైతులకు నీళ్లు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు అన్నారు…
అసెంబ్లీలో రేవంత్ చెప్పిందంతా చెత్తవాగుడని తేటతెల్లమైంది
కాంగ్రెస్ ,ఎంపీలు, ఎమ్మెల్యేలు గత కొద్దిరోజులుగా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి ల భూముల సర్వేలు, పరిశీలన అంటూ తిరుగుతున్న విషయమై సూర్యాపేటలో మీడియా మిత్రులు అడగగా స్పందించిన మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి..
*మాజీమంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..*
కొండలెన్ని తవ్విండ్రు.. ఎలుకలెన్ని పట్టిండ్రు..
కాంగ్రెస్ నేతల తెలివితక్కువ వేశాలను చూసి ప్రజలు నవ్వుతున్నరు..
అసెంబ్లీలో రేవంత్ చెప్పిందంతా చెత్తవాగుడని తేటతెల్లమైంది..
దారి తప్పిన వాళ్ల వాస్కోడిగామా చెప్పినట్లు విని పోయినోళ్ల పరువు పోయింది..
సర్వే అని పోతున్న కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేల సగం ఆస్తులు కూడా మాకులేవు..
ఎందుకు ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారు..
కెసిఆర్ భూముల సర్వే అనిపోయినోళ్లకు అక్కడి దళితులే చెప్పుతో కొట్టినట్టు సమాదానం చేపిండ్రు..
కేటీఆర్, హరీష్ రావు, మేము మాకున్న ఆస్తులు అఫిడవిట్ లో చూపినవే..
ఎలక్షన్ అఫిడవిట్ లో చూపించినవే.. మళ్లీ సర్వేలని ఎందుకు కాలయాపన చేస్తున్నరు..
మా ఇండ్ల చుట్టూ యాత్రలు చేస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారుల ఖర్చులు ఎవరు భరిస్తున్నారో చెప్పాలి..
భూముల సమస్యలు ఉంటే కలెక్టర్, RDO, తహసీల్దార్ చూసుకుంటారు..
కేసులు, పంచాయితీలు ఉంటే పోలీసులు చూసుకుంటారు..
ఇందులో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల కోతి చేష్టలు, చిల్లర వేషాలు ఎందుకు..
మా ఇండ్లకు వస్తామంటే మేమే స్వాగతించి మర్యాద చేద్డుం కదా..
అన్ని లీగల్ గా ఉన్నా మమ్మల్ని అనవసరంగా సీఎం పంపిస్తున్నారని కాంగ్రెస్ నేతలే అంటున్నారు..
ఆస్తుల మీద మోజు ఉంటే వందల కోట్ల భూములు వదిలి వేలల్లో ఉన్న భూములు ఎందుకు కొనుక్కుంటాం..
మా ఇండ్ల చుట్టూ తిరిగి కాంగ్రెస్ నేతలు కొత్తగా తేల్చేదేమీ లేదు..
మీడియాలో సెన్సేషన్ కోసమే చిల్లర వేషాలు వేస్తున్నరు..
ప్రభుత్వ భూములను మేము కాపాడినం కాబట్టే ఈరోజు మీరు అమ్ముకుంటున్నారు..
కాంగ్రెస్ నాయకులు ఎక్కడెక్కడ భూములు గుంచుకుంటున్నారో అన్నీ వస్తున్నాయి..
22A భూ హారతి పేరున మీరు చేస్తున్న అక్రమాలు ప్రజలంతా గమనిస్తున్నరు..
రైతుల సమస్యలను పక్కదారి పట్టించేందుకు డ్రామాలు చేస్తున్నరు..
ఇంకా ఎన్నిరోజులు ఇలా కాలయాపన చేస్తారు..
మీడియాలో మీరెంత దైవర్షన్ చేసినా ఎండిన పొలాలను పచ్చగా మార్చలేరు..
రేపటి నుంచి మళ్లీ ఏ సాకుతో రైతులను పక్కదారి పట్టిస్తరు..
ఇకనైనా డ్రామాలు మాని రాష్ట్రంలో రైతుల సమస్యలపైన, అభివృద్ధి పైన దృష్టి పెట్టండి..
ముందు రైతులకు నీళ్లు, 24 గంటల కరెంట్ ఇచ్చి ఉన్న పంటలన్నా కాపాడడండి..