2015 లో ప్రారంభమైన డ్రైవర్ బీమా 2024 లో ఆగిపోయింది.. కెసిఆర్ పెట్టిన పథకాలన్నీ ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..
*సూర్యాపేట జిల్లా..
డ్రైవర్ భీమా పథకం రూ. 5 లక్షల చెక్కు అందజేత..
*2015 లో ప్రారంభమైన డ్రైవర్ బీమా 2024 లో ఆగిపోయింది..
కెసిఆర్ పెట్టిన పథకాలన్నీ ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి..
*డ్రైవర్ కొడవలికంటి యాకయ్య కుటుంబానికి డ్రైవర్ భీమా చెక్కు అందజేసిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్..*
సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం, మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలో
2023 లో లో పొలం దున్నుతుండగా ట్రాక్టర్ తిరగబడి ప్రమాదవశాత్తు మరణించిన డ్రైవర్ కొడవలికంటి యాకయ్య గౌడ్.
డ్రైవర్ కొడవలికంటి యాకయ్య కుటుంబానికి సంబందించిన చెక్కును గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో అతని భార్య కొడవలికంటి కవిత కు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ డ్రైవర్ భీమా చెక్కును అందజేసిన సమయంలో ఎంతోమంది డ్రైవర్లు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనలో ఈ భీమా ప్రమాదవశాత్తు మరణించిన మా డ్రైవర్ కుటుంబాలకు అందిస్తలేరని ఆవేదన వ్యక్తం చేశారు.
*కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి బిఆర్ఎస్ లో చేరికలు..
తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ల కు చెందిన జీడీ వెంకటేశ్వర్లు, బూర్గుల రాంబాబు లతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ లు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.