8వ తరగతి బాలికను గర్భవతిని చేసిన టెన్త్ క్లాస్ బాలుడు..!

సూర్యాపేట జిల్లాలో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు..

పిల్లల్ని పేరెంట్స్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శారీరక, మానసిక మార్పులు కారణంగా .. టీనేజ్‌లో వారు దారి తప్పే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు వారి బాగోగులు తెలుసుకుంటూ ఉండాలి. స్కూల్‌లో విషయాల గురించి చర్చించాలి. తల్లిదండ్రులు.. పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలి. లేదంటే మాత్రం వారు ట్రాక్ తప్పే అవకాశం ఉంటుంది…

సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు (ఎస్) మండల పరిధిలో 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక గర్భం దాల్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికకు ఇదే ప్రాంతానికి చెందిన 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడు కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు.
ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం.
బాలిక మైనర్ కావడంతో పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.