మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్..!

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్..!

మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తలపెట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఉదయం నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ గృహనిర్బంధాలతో పాటు అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలింపు

భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధితో పాటు 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, ఆర్టీసీ డిపో పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించిన ప్రశాంత్ రెడ్డి..

బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ ప్రజల దశాబ్దాల కల అయిన అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తాను తలపెట్టిన శాంతియుత ‘కఠోర నిరాహార దీక్ష’ను పోలీసు బలగాలతో అడ్డుకోవడం రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, రాక్షస చర్య అని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యల సాధన కోసం తాను అహింసా మార్గంలో నిరసన తెలియజేస్తుంటే, ప్రభుత్వం పోలీసులతో ఉక్కుపాదం మోపాలని చూడటం శోచనీయమన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు..ప్రభుత్వ హయాంలో మంజూరై, దాదాపు 75 శాతం పనులు పూర్తి చేసుకున్న భీంగల్ 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే, భీంగల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయాలని, మూతపడిన భీంగల్ బస్ డిపోను పునఃప్రారంభించాలని కోరారు. గత మున్సిపల్ ఎన్నికల ముందు రూ. 12 కోట్ల నిధులతో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పెండింగ్ పనుల సాధన కోసమే 15వ తేదీన చుక్క మంచి నీరు కూడా ముట్టకుండా ఒక రోజు కఠోర నిరాహార దీక్షకు పూనుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు..