న‌డిరోడ్డుపై మూడు వాహ‌నాలు ద‌గ్ధం…

న‌డిరోడ్డుపై మూడు వాహ‌నాలు ద‌గ్ధం.

రైల్వే కోడూరు మండలం బాలుపల్లి చెక్ పోస్ట్ వద్ద ప్ర‌మాదం.

లారీని వెనుక నుంచి ఢీకొన్న ఇన్నోవా కారు.

ఇన్నోవా కారును ఢీకొన్న మరో కారు.

ముగ్గురికి గాయాలు తిరుపతి ఆస్పత్రికి తరలింపు .

మంటల్లో మూడు వాహనాలు ద‌గ్ధం.

సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది .

ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఒక ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ఇన్నోవా కారును మరో కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, చూస్తుండగానే మూడు వాహనాలు అగ్నికీలల్లో చిక్కుకుని పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కాపాడి, మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంతో రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.