ఫేక్ పిఏ ఫోన్ కాల్స్…!.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిఏ అంటూ మెసేజ్లు..!

*సూర్యాపేట జిల్లా…*

*ఫేక్ పిఏ ఫోన్ కాల్స్…*

మధ్య కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేల పేరు చెప్పుకుని వారి అనుచరులు, పీఏలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీఏ అంటూ ఓ వ్యక్తి కోదాడ సీడీపీఓ కార్యాలయయంలోని సూపర్ వైజర్ గా పని చేస్తున్న ఓ మహిళకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాంటి బెదిరింపులు ఆమెకు మాత్రమే కాదు.. చాలా మంది సూపర్ వైజర్లకు వచ్చినట్లు సదరు మహిళ తెలిపింది. ప్రస్తుతం కాల్ చేసి బెదిరింపులకు పాల్పపడిన వ్యక్తిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు..

మంత్రి ఉత్తమ్ పీఏ నరేష్ రెడ్డి అంటూ అంగన్ వాడీ సూపర్ వైజర్ కు అసభ్యకర పదజాలంతో మెసేజ్,, ఫోన్ కాల్ లో వేధింపులు పాల్పడుతున్న వ్యక్తి…

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీఏగా ఆ పేరుతో ఎవ్వరు లేరు అంటు మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి సమాచారం..

మహిళను లొంగదీసుకునేందుకు మంత్రి పీఏ అంటూ అసభ్యకర సందేశాలు పంపుతూ వేధిస్తున్నా వైనం….

సోషల్ మీడియాలో ఆడియోవైరల్ అయ్యింది..

ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసిన, మహిళా ఉద్యోగిని..

….ఆగంతుకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు…

ఏరియాని బట్టి వ్యక్తుల పేరును వాడుకుంటున్నట్లుగా తెలిపిన బాధితురాలు….

బాధితురాలు ఆవేదన...

సూపర్ వైజర్ గా పని చేస్తున్న ఓ మహిళకు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీఏ అంటూ పదే పదే కాల్స్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం గురించి సదరు మహిళ మాట్లాడుతూ.. ‘నేను మంత్రి ఉత్తమ్ కుమార్ పర్సనల్ పీఏ అని.. నా పేరు నరేష్ రెడ్డి అంటూ ఫోన్ చేశాడు. నేను హుజూర్‌నగర్ ప్రాంతంలో వేరే సూపర్ వైజర్లతో కూడా మాట్లాడాను. మీకు కానీ, మీ అంగన్ వాడీ టీచర్లకు కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగాడు. కొన్ని సమస్యలు ఉన్నాయండీ అని చెప్పారు. మీకు రెండు రోజుల్లో ఉత్తమ్ కుమార్ సార్ తో మీటింగ్ అరేంజ్ చేస్తాను. మీరు ఒక వెహికిల్ రెడీ చేసుకొని సమస్యలు ఉన్న టీచర్లు అందులో రండి అని చెప్పాడు. అలా రెండు మూడు సార్లు కాల్ చేశాడు. మీతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మాట్లాడుతారు.. ఈ నెంబర్‌ ఆయితే ఫీడ్ చేసుకోండి అని చెప్పారు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు మనకు ఎందుకు కాల్ చేస్తారు. అందుకే నేను ఆ నెంబర్ సేవ్ చేసుకోలేదు.పాలకీడు రమాదేవి డిటేల్స్ నాకు పెట్టారు.. ఆ డిటేల్స్ మీకు పంపాను చూడండి అని వాట్సాప్ కాల్ చేశాడు. ఈలోగా ఆ మేడం నాకు ఫోన్ చేసి ఎవరో మన డిటేల్స్ అడుగుతున్నాడు.. మంత్రి పీఏ అంటున్నాడు. చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడని చెప్పింది’..వరుసగా వాట్సాప్ కాల్స్ చేస్తూ వస్తున్నాడు. నేను మా ఆఫీస్ ఫోన్ తో ఆయనకు కాల్ చేసి ఆయన మాటలు రికార్డు చేశాను. నువు చాలా అందంగా ఉన్నావు.. ఓకే అంటే ఎంత డబ్బైనా ఇస్తాను అంటూ బ్యాడ్ గా మాట్లాడటం మొదలు పెట్టాడు. ఆ మాటలు విన్న తర్వాత అతన్ని తిట్టాను. చాలా అసహ్యంగా మాట్లాడుతూ వాయిస్ మెసేజ్ పెట్టాడు. తర్వాత అవన్నీ డిలీట్ చేశాడు. అవన్నీ నేను మా గ్రూప్ మెంబర్స్ కి ఫార్వార్డ్ చేశాను. తర్వాత నన్ను బెదిరించడం మొదలు పెట్టాడు. మర్డర్ కేసులో నేను మూడుసంవత్సరాలు చర్లపల్లి జైల్లో ఉండొచ్చాను. తల పగలకొట్టి చంపాను.. మర్డర్స్ నాకు కొత్త కాదు. అలాగే నీ గురించి, నీ అడ్రస్ గురించి తెలుసుకోవడం నాకు మూడు రోజుల పని. నీకు మాత్రమే పోలీసులు తెలుసా? నాకు కూడా చాలా మంది పోలీసులు తెలుసు అన్నాడు..

మంత్రి ఉత్తం పేరుతో ఫేక్ కాల్ గమనించి,, తాను ధైర్యంగా ముందుకు వచ్చి ఫేక్ పిఏ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయగా.. కొందరు వ్యక్తులు తన పట్ల అసభ్యకరంగా మెసేజ్లు పెట్టడం తనను ఎంతో బాధించిందని అన్నారు… దీన్ని కొందరు రాజకీయ కోణంలో,, మరికొందరు వ్యక్తిగత కోణంలో కామెంట్స్ పెట్టడం తరలి ఎంతో గానో బాధిస్తుందని అన్నారు….

మహిళల్లో అవేర్నెస్ తేవడం ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు ధైర్యంగా పోలీసులకి ఫిర్యాదు చేయాలి అని అందరికీ తెలిసేలా తాను ముందుకు వస్తే కొంతమంది కావాలని వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు… మహిళలకి భద్రత అవసరం అలాగే ధైర్యం కూడా అవసరమనే ఉద్దేశంతోనే తన పోలీసులకు ఫిర్యాదు చేశానని ఇందులో ఎటువంటి రాజకీయ కోణాలు లేదని ఆమె అన్నారు..