నేటి పంచాంగం… నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌻పంచాంగం🌻
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 03 – 11 – 2024,
వారం … భానువాసరే ( ఆదివారం )

శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయణం,
శరదృతువు,
కార్తీక మాసం,
శుక్ల పక్షం,
స్వాతి కార్తె,

తిథి : విదియ రాత్రి 7.57 వరకు,
నక్షత్రం : అనూరాధ, పూర్తి,
యోగం : సౌభాగ్యం. ఉదయం 11.51 వరకు,
కరణం : బాలువ. ఉదయం 7.15 వరకు,
తదుపరి కౌలువ రాత్రి 7.57 వరకు,

వర్జ్యం : ఉదయం 9.30 – 11.15,
దుర్ముహూర్తము : సాయంత్రం 3.54 – 4.40,
అమృతకాలం : రాత్రి 7.52 – 9.35,
రాహుకాలం : సాయంత్రం 4.30 – 6.00,
యమగండం : మ12.00 – 1.30,
సూర్యరాశి : తుల,
చంద్రరాశి : వృశ్చికం,
సూర్యోదయం : 6.02,
సూర్యాస్తమయం: 5.26,

*_నేటి విశేషం_*

*భగినీ హస్త భోజనం*

*కార్తీక శుద్ధ విదియ, యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం*
భగినీ అంటే తోబుట్టువైన స్త్రీ అంటే అక్క లేదా చెల్లి అని అర్ధం. సనత్కుమార సంహితలో ఈ యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం విశేషాలు చెప్పబడ్డాయి.

యముడి చెల్లెలు యమున. యమునా దేవి ప్రతిరోజు తన ఇంటికి వచ్చి విందు భోజనం చేసి వెళ్ళమని యముడిని ప్రార్ధిస్తూ ఉండేది.
యముడికి తీరికలేక – ఎన్నోసార్లు వస్తానని చెప్పినా వెళ్ళలేదు.
ఒకనాడు చెప్పకుండానే తన కుటుంబంతో కలిసి యమున ఇంటికి వెళ్తాడు, ఆ రోజే కార్తీక శుద్ధ ద్వితీయ.

చెల్లులు మహానందంతో అన్నకు, ఆయన కుటుంబానికి రుచికరమైన విందు భోజనం పెట్టింది.
సంతోషించిన యముడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు.
యమున “అన్నా! ప్రతిసంవత్సరం ఇదే విదియ నాడు నా ఇంటికి వచ్చి, నా చేతి వంటలు స్వీకరించి, నన్ను దీవించాలి.
అంతేకాదు, ఈ కార్తీక శుద్ధ విదియ నాడు ఎవరు సోదరి హస్త భోజనం చేస్తారో వారు నరకాన్ని పొండకూడదు” అని అర్ధించింది.

యముడు “తధాస్తు!శుభమస్తు! ” అని అనుగ్రహిస్తూ “అమ్మా!ఈ దినం ఎవరు యమునా నదిలో స్నానం చేసి, పితృదేవతలకు తర్పణం చేసి, తన సోదరిని గౌరవించి, ఆమె చేతి భోజనం చేస్తారో వాళ్లు ఎన్నటికి నరకద్వారాన్ని చూడరు…

*_🌻శుభమస్తు🌻_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏