కొత్త షూస్ కొనుగోలు చేసి.. పాతవి రిటర్న్..!.. 550 బాక్సులతో సెల్లర్‌కు షాక్..!

కొత్త షూస్ కొనుగోలు చేసి.. పాతవి రిటర్న్! 550 బాక్సులతో సెల్లర్‌కు షాక్..!

ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త షూస్ ఆర్డర్ చేసిన కస్టమర్లు

దాదాపు 550 బాక్సుల్లో కొత్త షూస్‌కు బదులు పాత షూస్ పెట్టి రిటర్న్

భారీగా నష్టపోయిన సెల్లర్

న్యాయం చేయాలంటూ ఆగ్రాలోని పోలీసులను ఆశ్రయించిన బాధితుడు…

ఆగ్రాలోని మోహన్‌పురాకు చెందిన వ్యాపారి గౌరవ్ గుప్తా (RK Enterprises, Navya International సంస్థల యజమాని) ఫ్లిప్‌కార్ట్ వేర్‌హౌస్ ద్వారా డెలివరీ కోసం నవంబర్ 16న 550 బాక్సుల కొత్త షూస్ పంపారు. అయితే, ఆ బాక్సులను పరిశీలించినప్పుడు వాటిలో కొత్త షూస్‌కు బదులుగా పాత, వాడిన షూస్ ఉన్నట్లు గుర్తించారు..

కస్టమర్లు ఆన్‌లైన్‌లో కొత్త షూస్ ఆర్డర్ చేసి, వాటి స్థానంలో పాతవి పెట్టి రిటర్న్ చేశారనే ప్రచారం జరుగుతుండగా; రవాణా సమయంలో లేదా వేర్‌హౌస్ సిబ్బంది ప్రమేయంతో ఈ మార్పిడి జరిగి ఉండవచ్చని ఈ-కామర్స్ సెల్లర్స్ అసోసియేషన్ అనుమానం వ్యక్తం చేస్తోంది..