Folk Artist Madhuri Rathod Hospitalized After Suicide
డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం..
ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన మాధురి రాథోడ్
డోర్ పగలగొట్టి ఫ్యాన్‌కు వేలాడుతున్న మాధురి రాథోడ్‌ను కాపాడిన కుటుంబ సభ్యులు
పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం
ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదంటూ మాధురి రాథోడ్ ఆవేదన
ఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నాలు నార్సింగి పోలీసులు చేస్తున్నారంటూ మాధురి రాథోడ్ ఆరోపణ
తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యులు వెంటనే తలుపులు పగలగొట్టి ఆమెను కాపాడటంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తోటి జానపద కళాకారుడు ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని మోసం చేశాడని, ఏఐ మార్ఫింగ్ వీడియోలతో వేధిస్తున్నాడని మాధురి ఇటీవల నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసినా పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు పట్టుకోకపోవడం, కేసులో పురోగతి లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.యూట్యూబ్‌లో జానపద పాటలతో గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి , మాధురి రాథోడ్ వ్యవహారంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం ఈశ్వర్ సాయిపై కేసు పెట్టిన మాధురి రాథోడ్ ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. పెళ్లి పేరుతో నమ్మించి వంచించడం, పరువు తీసేలా సాగిన వ్యవహారాలు, పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితుడిపై తగిన చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఈ తీవ్ర నిర్ణయానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. మాధురి తన గదిలో ఫ్యానుకు ఉరివేసుకోగా కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించి తలుపులు పగలగొట్టి ఆమెను కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ప్రముఖ ఫోక్ సింగర్, డ్యాన్సర్ ఈశ్వర్ సాయిపై మూడు రోజుల క్రితం మాధురి రాథోడ్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడని, నమ్మించి మోసం చేయడమే కాకుండా ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసిన అసభ్యకర వీడియోలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాడని ఆమె పేర్కొన్నారు. అయితే ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా నిందితుడిని పోలీసులు పట్టుకోలేకపోవడం, దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆవేదనతోనే మాధురి మానసిక కుంగుబాటుకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.
వివాహమై ఒక బాబు ఉన్న ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌తో కలిసి ఇటీవల వేములవాడలోని ఓ లాడ్జిలో ఉండగా ఆయన భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ సమయంలో జరిగిన వాగ్వాదం, దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. తాను వాష్‌రూమ్ కోసమే మాధురి రూమ్‌కి వెళ్లానని ఈశ్వర్ సాయి పలు విచిత్ర వివరణలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. అయితే తెరవెనుక వేధింపులు మితిమీరడంతో మాధురి చట్టపరమైన న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. ‘ప్రమీల ఓ ప్రమీల’, ‘బాసింగ బలాలే’ వంటి పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. తనకు న్యాయం జరగడం లేదనే నిస్పృహతో మాధురి ప్రాణాలు తీసుకోవడానికి యత్నించిన ఘటన దుమారం రేపుతోంది. పోలీసులు ఈ కేసు విచారణను వేగవంగం చేసి ఈశ్వర్ సాయిని వెంటనే అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ కేసుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.