నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం..

DGP

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం..

హైదరాబాద్లోని గృహప్రవేశంలో హిజ్రాల పేరుతో రూ. 50,000 డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులను వేధించి, అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

బాధితుల వీడియో వైరల్ కావడంతో, రాష్ట్రవ్యాప్తంగా బలవంతపు వసూళ్లు, వేధింపులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. శుభకార్యాలు, వ్యాపార వేదికల వద్ద భయభ్రాంతులకు గురిచేసే ముఠాలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

నేరపూరిత వసూళ్లకు పాల్పడే వారిని, గౌరవంగా జీవించే ట్రాన్స్‌జెండర్లను వేర్వేరుగా చూస్తూ అక్రమ దందాలపైనే ఉక్కుపాదం మోపనున్నారు.

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్‌లోని ఓ గృహప్రవేశంలో హిజ్రాల పేరుతో రూ. 50,000 డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులను వేధించి వారితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో పోలీసులు ఈ సంఘటనపై సీరియస్ అయ్యారు. ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంతో నేరపూరిత వసూళ్లకు పాల్పడే వారిని, గౌరవంగా జీవించే ట్రాన్స్‌జెండర్లను వేర్వేరుగా చూస్తూ అక్రమ దందాలపైనే ఉక్కుపాదం మోపనున్నారు. ఎవరైనా కావాలని ఇలా చేస్తే వారిని పట్టుకుని వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా అరెస్టు చేసి కఠిన శిక్షవిదిస్తామని సీవీ ఆనంద్ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ఏక్కడైన బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీవీ ఆనంద్ తెలిపారు.