గవర్నమెంట్ పాఠశాలలో లక్ష దాటిన అడ్మిషన్లు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రారంభమైన ఐదు రోజుల్లోనే 1.17 లక్షల మంది విద్యార్థులు చేరారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో ఫస్ట్ క్లాసులోనే 55,000 మందికిపైగా చేరడం విశేషం. ప్రైవేట్ పాఠశాలల నుంచి 18,000 మంది మారినట్లు తెలుస్తోంది. బడి బాట కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం అడ్మిషన్ల సంఖ్య 2 లక్షలు దాటే అవకాశముందని అంచనా వేసిన అధికారులు.