ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) శుక్రవారంనాడు ఫోన్ చేశారు. ఈనెల 15 నుంచి 17 వరకూ ఆల్బెర్టాలో జరుగనున్న జీ7 సదస్సుకు (G7 Sammit) హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు.
. మొదట్లో భారత్ కు ఆహ్వానం లేనట్లేనని అంతా ఫిక్స్ అయిపోయారు…ఇలాంటి సమయంలో కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ ఇవాళ భారత ప్రధాని మోడీకి స్వయంగా కాల్ చేసి ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు రావాలని ఆహ్వానం పలికారు. దీంతో ప్రధాని మోడీకి వస్తానని హామీ ఇచ్చారు. దీంతో భారత్-కెనడా మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది.
కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ నుంచి కాల్ అందుకోవడం ఆనందంగా ఉందని ప్రదాని మోడీ ట్వీట్ చేశారు. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన ఆయనకు అభినందనలు చెప్పానన్నారు. అలాగే ఈ నెల చివర్లో కననాస్కిస్లో జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. లోతైన వ్యక్తుల మధ్య సంబంధాలతో ముడిపడి ఉన్న శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా, భారతదేశం మరియు కెనడా పరస్పర గౌరవం మరియు ఉమ్మడి ఆసక్తుల ద్వారా మార్గనిర్దేశం చేయబడి, పునరుద్ధరించబడిన శక్తితో కలిసి పనిచేస్తాయని తెలిపారు. శిఖరాగ్ర సమావేశంలో తమ మధ్య సమావేశం కోసం ఎదురు చూస్తున్నట్లు మోడీ తెలిపారు.
గతంలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ సింగ్ హత్య తర్వాత భారత్-కెనడా మధ్య సంబంధాలు దారుణంగా క్షీణించాయి. ఈ హత్యలో భారత్ పాత్ర ఉందని అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఆ తర్వాత ఇరుదేశాలూ దౌత్యవేత్తల్ని బహిష్కరించుకున్నాయి. అలాగే చర్చల ప్రక్రియను పూర్తిగా నిలిపేశాయి. ఈ దశలో కెనడాలో ప్రధాని మార్పు జరిగింది. జస్టిన్ ట్రూడో స్ధానంలో వచ్చిన మార్క్ కార్నీ నేతృత్వంలో ఈసారి జీ7 సదస్సు ఈ నెల 13వ తేదీ నుంచి జరగనుంది. దీనికి భారత్ ను తొలుత ఆహ్వానించలేదు. అయితే విమర్శలు వస్తాయన్న భయంతో చివరి నిమిషంలో మోడీకి స్వయంగా ఫోన్ చేసి కెనడా ప్రధాని జీ7 సదస్సుకు రావాలని ఆహ్వానించారు. దీనికి మోడీ కూడా సరేనన్నారు..