ఎకరం అమ్మకానికి పెట్టా.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న.. గరిడేపల్లి మండలంలో ఓ అభ్యర్థి చిత్రమైన ఆఫర్.!..
ఎకరం అమ్మకానికి పెట్టా.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న..
సాయిబాబా గుడి.. సేవాలాల్ గుడి ఏది కావాలన్నా కట్టిస్తా…
అవసరమైతే ఓటుకి 20,000 ఇస్తా.. ఏకగ్రీవం చేయండి..
*సూర్యాపేట జిల్లా….*
గరిడేపల్లి మండలం గారకుంటతండా.. లో గ్రామపంచాయతీ ఎన్నికల రాబోతున్న సమయంలో చిత్రమైన ఘటన….*
ఇదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది..
వీడియో చూడాలంటే క్రింద లింక్ ని క్లిక్ చేయండి.
https://youtube.com/shorts/xa7eNG93JzY?si=MkhC4AjFBbOMeiLc
వచ్చే సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ పదవికి నన్ను ఏకగ్రీవం ఎన్నుకుంటే రూ.1 కోట్లు గ్రామ అభివృద్ధికి ఇస్తా” అంటూ ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. ఏంటీ గ్రామ సర్పంచ్ పదవికి రూ.1 కోట్లా అని అనుకుంటున్నారా? దీనికి నిజమేనని సమాధానం వస్తోంది. ఎన్నికల బరిలో నిలిచి పోటీ చేసి ప్రతి ఓటరును ఓటేయండి అని అడిగే బదులు, ఒకేసారి సెటిల్మెంట్ అయ్యేలా కొందరు ఇలా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో ఖర్చు చేసే బదులు గ్రామ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నగదు ఇస్తానంటూ తమను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు..
దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతోపాటు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పోస్టు సైతం తెగ వైరలవుతోంది. సూర్యాపేట జిల్లా.. గరిడేపల్లి మండలంలో ఒక గ్రామానికి చెందిన వ్యక్తి సర్పంచ్‌గా తనను ఎన్నుకోవాలని ఆ గ్రామ ప్రజలకు కోరారు. పోటీ లేకుండా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి చేస్తానని, కోటి రూపాయలను ఖర్చైనా పర్వాలేదు కానీ పంచాయతీ పరిధిలోని ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు…
ఎకరం కోటి అమ్మకానికి పెట్టా.. సర్పంచ్ గా పోటీ చేస్తున్న,, నన్ను గెలిపిస్తే ఊరు అభివృద్ధి చేస్తా.. ఏకగ్రీవం చేస్తే కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తా అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోని విడుదల చేసిన ఘటన స్థానికంగా వైరల్ మారింది.. ఇది సరదాకి చేసిన వీడియోను లేకపోతే అతను మనసులో ఉన్న మాటని బయటపెట్టిందో ఇంకా ఆ విషయం తెలియ రాలేదు..