తెలంగాణ మహిళా కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కీలక నియామకాలు..

తెలంగాణ మహిళా కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కీలక నియామకాలు చేపట్టింది. కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు.

కమిషన్ సభ్యులుగా తెలంగాణ ఉద్యమకారుడు దివంగత శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతతో పాటు శశికళ యాదవ్ రెడ్డి, సదాలక్ష్మి, రాధాభాయి, ఉజ్మా షకీరాలను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐదేళ్లపాటు వీరు పదవిలో కొనసాగనున్నారు…

తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతచారి తల్లి కాసోజు శంకరమ్మకు.. మహిళా కమిషన్ సభ్యురాలిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో శ్రీకాంతచారి చేసిన త్యాగం.. ఇప్పటికీ తెలంగాణలో గుర్తు ఉంది. మహిళా కమిషన్‌లో శంకరమ్మకు అవకాశం ఇచ్చారు…తెలంగాణ సాయుధ పోరాట యోధురాలైన చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను కూడా మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా అవకాశం కల్పించింది..మరికొంతమందికి కూడా మహిళా కమిషన్ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. సదాలక్ష్మి, శశికళ యాదవ్ రెడ్డి, రాధాభాయి, ఉజ్మా షకీరాలను కూడా తెలంగాణ ప్రభుత్వం మహిళా కమిషన్ సభ్యులుగా నియమించింది. ఈ నియామకాల్లో సామాజిక వర్గాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.