పంజాబ్ కింగ్స్‌ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరిత విజయం…!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన 55వ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 3 వికెట్ల తేడాతో గెలిచి అభిమానులను అలరించింది. 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 19 ఓవర్లలోనే ఛేదించడం విశేషం..మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (56), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (59*) అద్భుత అర్ధశతకాలతో మెరిశారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారీ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ కీలక ఇన్నింగ్స్‌లతో ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. ఈ ఛేజ్ ధర్మశాల మైదానంలో అత్యధిక విజయవంతమైన రన్ ఛేజ్‌గా రికార్డు సృష్టించింది..

51 పరుగులు చేసిన డేవిడ్‌ మిల్లర్
మరోవైపు డేవిడ్‌ మిల్లర్‌ 28 బంతుల్లో 51 పరుగులతో మెరిపించాడు.
చివర్లో ఆశుతోష్‌ శర్మ 24 పరుగులు చేయగా, మాధవ్‌ తివారీ 18 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఢిల్లీ జట్టు 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓపెనర్‌ ప్రియాంశ్‌ ఆర్య ఐపీఎల్‌లో తన ఐదో అర్ధ సెంచరీ నమోదు చేశాడు..

మ్యాచ్‌ తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన అతడు 24 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు.
ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌తో కలిసి తొలి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
33 బంతుల్లో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. శ్రేయస్‌ అయ్యర్‌ కూడా అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు.