రాజమండ్రి నుండి ఉత్తరప్రదేశ్ కు 431 కిలోల గంజాయిని తరలిస్తుండగా పంతంగి టోల్ ప్లాజా పట్టుకున్న పోలీసులు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విశ్వసనీయ సమాచారం తో రాచకొండ నాకోటిక్స్ పోలీస్ ఎన్ఆర్పిఎస్ బృందం చౌటుప్పల్ పోలీస్ ల సంయుక్త ఆధ్వర్యంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించగా నకిలీ నెంబర్ ప్లేట్ తో గల మహీంద్రా XUV వాహనాన్ని ఆపి తనిఖీలు చేయగా అందులో 431 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తులలో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుండి పారిపోయారు మరి ఇద్దరిని పోలీసులు అదుపులోకి విచారణ చేయగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని రాజమండ్రి ప్రాంతంలో రాకేష్ అనే వ్యక్తి వద్ద నుండి గంజాయిని సేకరించి ఉత్తరప్రదేశ్ కు తరలిస్తున్నట్టు తెలిపారు.