భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య ఇంధన రంగ భాగస్వామ్యం మరింత బలపడింది. భారత వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాల్లో (స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్) 30 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును నిల్వ చేసేందుకు యూఏఈ అంగీకరించింది. ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబి పర్యటన సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో జరిపిన చర్చల అనంతరం ఈ కీలక ఒప్పందం కుదిరినట్లు భారత విదేశాంగ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది…
పాకిస్తాన్ దేశస్థులను తన్ని తన్ని తరిమేస్తోంది కదా యూఏఈ.. చివరికి ఇచ్చిన అప్పు కూడా ముక్కు పిండి వసూలు చేసింది కదా..
దీంతో యూఏఈ మీద కడుపు మంటతో రగిలిపోతుంది పాకిస్తాన్..అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురాలేదు. అమెరికాతో చెప్పి ఇబ్బంది పెట్టలేదు. చైనాతో చెప్పుకొని
అణిచి వేయలేదు. కడుపు ఉబ్బరంతో రగిలిపోవడం తప్ప.. ఏమి చేయలేదు.
శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అన్నట్టుగా.. పాకిస్తాన్ దేశాన్ని తన్ని తరిమేస్తున్న యూఏఈ తో భారత్ స్నేహ హస్తాన్ని చాచింది. అంతేకాదు దోస్త్ మేరా దోస్త్ అంటూ పాటలు పాడుతుంది. తాజాగా యూఏఈ తో అత్యంత కీలకమై ఇంధన ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అబుదాబిలోని పెట్రోలియం రిజర్వ్ లో దాదాపు మూడు కోట్ల బ్యారెళ్ల వరకు చమురు నిల్వచేసే అవకాశం భారతదేశపు ఏర్పడింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహియాన్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు అబుదాబి వేదికగా సాగాయి. ఆ తర్వాత రెండు దేశాల అధిపతులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పశ్చిమ ఆసియా ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. ఇతర పరిస్థితులను అంచనా వేసి భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. అవి భారత దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ఇబ్బందికరంగా మారిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
పశ్చిమ ఆసియా లో యుద్ధం తర్వాత అన్ని దేశాలు పొదుపు చర్యలు పాటిస్తున్నాయి. అయితే ఏ దేశం కూడా ఈ స్థాయిలో గల్ఫ్ దేశాలతో ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ఈ విషయంలో భారత్ ప్రపంచ దేశాల కంటే ముందుగానే తొలి అడుగు వేసింది. తద్వారా భవిష్యత్తు కాలంలో వచ్చే ఇబ్బందులను ముందుగానే అంచనా వేసింది. మూడు కోట్ల బ్యారెళ్ళ చమురు ను నిల్వ చేయడం భారతదేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. కేవలం ముడి చమురు మాత్రమే కాకుండా గ్యాస్ నిల్వలు.. ఎల్పిజి సరఫరా.. రక్షణ సహకారం.. ఇంకా అనేక విషయాలు మీద ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలు మనకు లాభం చేకూర్చితే.. పొరుగున ఉన్న పాకిస్తాన్ దేశానికి కడుపుమంట రగిలిస్తున్నాయి.
గల్ఫ్ లో యుద్ధం తర్వాత.. ఇరాన్ దాడులు చేసిన తర్వాత యూఏఈ మనస్తత్వం పూర్తిగా మారిపోయింది. గతంలో మన దేశంతో వాణిజ్యం విషయంలో ఊహించిన స్థాయిలో దూకుడును ఆ దేశం కొనసాగించలేకపోయింది. ఎప్పుడైతే ఇరాన్ తమ మీద దాడులు చేసిందో.. అప్పుడే యూఏఈ పూర్తిగా మనసు మార్చుకుంది. ట్రేడ్.. ఇతర ఒప్పందాలను కుదుర్చుకునే పనిలో పడింది. అందువల్లే భారతదేశంతో స్నేహ హస్తాన్ని చాచింది. దీనివల్ల భారత్ భవిష్యత్తు కాలంలో వచ్చే ఇబ్బందులను.. సమస్యలను సులభంగానే ఎదుర్కునే అవకాశం ఉంది…
పర్యటనలో ఇంధన రంగంతో పాటు ఇతర రంగాల్లోనూ పలు ఒప్పందాలు కుదిరాయి. బ్యాంకింగ్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ రంగాల్లో భారత్లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ ముందుకొచ్చింది. రక్షణ, నౌకా సహకారం, నౌకా నిర్మాణం, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లోనూ సహకరించుకోవాలని నిర్ణయించాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు భద్రత కల్పించడం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. యూఏఈపై జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు..