పసిడి ప్రియులకు షాక్..భారీగా పెరిగిన బంగారం ధరలు..!

Gold Price Today: మహిళలకు షాక్‌..

బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఇటీవల లక్ష రూపాయలకుపైగా చేరిన తులం బంగారం ధర.. తర్వాత క్రమంగా దిగి వచ్చింది. ఒక్కసారిగా రూ.95 వేలకు దిగువన వచ్చింది. ఆ తర్వాత మెల్లమెల్లగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం మళ్లీ ఎగబాకుతోంది. మంగళవారం (జూన్‌ 3)న దేశీయంగా బంగారం ధర పెరిగింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,610 ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.99,000 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,760 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,610 వద్ద కొనసాగుతోంది.

జూన్‌ 2న ధరలతో పోల్చుకుంటే తులంపై ఏకంగా 1500 వరకు పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,850 ఉండగా, 94 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,610 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో ధర రూ.1,00,100 వద్ద ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఈ ధరలు అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రాంతాలను బట్టి జీఎస్టీ ఇతర ఛార్జీల ఆధారంగా ధర ఉంటుందని గుర్తించుకోండి.