గురుకుల స్కూళ్ల ప్రవేశాలకు నోటిఫికేషన్..!

*గురుకుల స్కూళ్ల ప్రవేశాలకు నోటిఫికేషన్*

TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో 5, 6, 9 తరగతుల్లో చేరేందుకు 2026 ఫిబ్రవరి 22న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని జిల్లాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు జనవరి 21 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు తెలిపారు.