సౌతాఫ్రికాపై భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం…!చెలరేగిన టీమిండియా బౌలర్లు….!

మూడోవ T 20 దర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యాన్ని సాధించింది…టాస్ గెలవడం భారత్‌కు కీలకంగా మారింది. భారత పేసర్లు అక్కడి వాతావరణాన్ని, పిచ్‌ను అద్భుతంగా వినియోగించుకున్నారు. పవర్ ప్లేలోనే కొత్త బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ, సౌతాఫ్రికా టాపార్డర్‌ను పూర్తిగా కూల్చేశారు. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా నిలకడైన లైన్స్, లెంగ్త్స్‌తో బౌలింగ్ చేసి, మొదటి ఆరు ఓవర్లలోనే దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను చిన్నాభిన్నం చేశారు.

సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ (61 పరుగులు) మినహా మరెవరూ కదులుతున్న బంతిని ఎదుర్కోవడానికి సుఖంగా కనిపించలేదు. బంతి పాతబడినా, భారత్ తమ ఒత్తిడిని ఏమాత్రం తగ్గించలేదు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే వికెట్లు తీయడంలో పాలుపంచుకోగా, స్పిన్నర్లు మధ్య ఓవర్లలో పరుగులను కట్టడి చేశారు. మార్‌క్రమ్ పోరాట పటిమ కారణంగానే సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 117 పరుగులు చేసింది.

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఏమాత్రం తొందరపడకుండా దూకుడుగా ఆడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (18 బంతుల్లో 35 పరుగులు, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరంభం నుంచే విరుచుకుపడ్డాడు. అతని నిర్భయమైన బ్యాటింగ్ కారణంగా భారత్ మొదటి ఐదు ఓవర్లలోనే 60 పరుగులకు చేరుకుంది. అభిషేక్ అవుటైన తర్వాత, శుభ్‌మన్ గిల్ (28 బంతుల్లో 28), తిలక్ వర్మ (34 బంతుల్లో 26 నాటౌట్) నిలకడగా ఆడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చారు. చివర్లో శివమ్ దూబే (4 బంతుల్లో 10 నాటౌట్) ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించి, భారత్‌కు 7 వికెట్ల తేడాతో, ఇంకా 25 బంతులు మిగిలి ఉండగానే, 120 పరుగులతో సునాయాస విజయం సాధించింది..

చెలరేగిన టీమిండియా బౌలర్లు..

టీమిండియా బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఏకంగా 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది (India vs South Africa).

టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ టీమిండియా బౌలర్లు చెలరేగారు. హర్షిత్, అర్ష్‌దీప్ ధాటికి దక్షిణాఫ్రికా 7 పరుగులకే మూడు టాపార్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఒక పక్క వికెట్లు పడుతున్నప్పటికీ ఐదెన్ మార్‌క్రమ్ (61) మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. డోనావన్ (20), నోర్ట్జే (12) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు (IND vs SA live update)..టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె ఒక్కో వికెట్ పడగొట్టారు. చివరకు దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. కటక్ మ్యాచ్‌లో టీమిండియా, ముల్లాన్‌పూర్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించి సమఉజ్జీలుగా ఉన్నాయి. ధర్మశాలలో గెలిచి సిరీస్‌లో ముందడుగు వేయాలని ఇరు జట్లు కృత నిశ్చయంతో ఉన్నాయి..