తెలుగు రాష్ట్రాల్లో ఎల్పీజీ సిలిండర్‌ల కొరత..!

ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా వివాదం కారణంగా ప్రపంచ చమురు మార్కెటింగ్ కంపెనీలు సంక్షోభంలో కూరుకుపోయాయి….

ముఖ్యంగా భారతదేశంలో ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తుంది…

మరోవైపు ఈ సెగ భారత్‌కు సైతం తగులుతుంది. దేశీయ వంట గ్యాస్ (LPG) కొరత కారణంగా ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ముంబై, ఒడిశా, హైదరాబాద్‌ సహా దేశ వ్యాప్తంగా వంట సిలిండర్ కొరత ఏర్పడింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎల్పీజీ గ్యాస్‌ కొరత కారణంగా పలు హోటళ్లు, హాస్టళ్లు మూత పడ్డాయి. ఐటీ కంపెనీల్లో క్యాంటీన్‌ నడపలేక సిబ్బంది చేతులెత్తేయడంతో ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం చేయమని ఉద్యోగులను కోరుతున్నారు. సరఫరా అంతరాయం వంట గ్యాస్ లభ్యతపై ఆందోళనలను రేకెత్తిస్తుంది. ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్ళు వంటి వాణిజ్య వినియోగదారులతోపాటు గృహ అవసరాలకు సైతం గ్యాస్‌ సిలిండర్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో డిమాండ్‌ దృష్ట్యా గ్యాస్ రేట్లు అమాంతం పెరుగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ. 60 పెరిగింది. ఈ పెంపుతో హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ. 965కు చేరుకుంది. గత నెలలో ఈ ధర రూ.905గా ఉంది. ఇక వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ. 115 పెరిగింది. ప్రస్తుతం పలు హోటళ్లు మూత పడటంతో మరికొన్ని హోటళ్లు వెనకటి కాలం మాదిరి కట్టెల కుంపటి మీద వంట వాడ్చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్‌ సిలిండర్ల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ (14.5 కేజీ) ధరలు ఇలా..
హైదారాబాద్‌లో 14.5 కేజీల సిలిండర్‌ ధర రూ. 965
వరంగల్‌లో 14.5 కేజీల సిలిండర్‌ ధర రూ. 984
విశాఖపట్నంలో 14.5 కేజీల సిలిండర్‌ ధర రూ. 1112
విజయవాడలో 14.5 కేజీల సిలిండర్‌ ధర రూ. 937.50
గుంటూరులో 14.5 కేజీల సిలిండర్‌ ధర రూ. 937.50
ఇక 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండఱ్‌ 144 రూపాయలు పెరగడంతో రూ.2,105కి చేరింది. 5 కేజీల డొమెస్టిక్‌ గ్యాస్‌ ధర రూ.335 పలుకుతుంది. ఇక 47,5 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.4,900గా ఉంది..

బ్లాక్ లో జోరుగా గ్యాస్ దందా…

ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు సామాన్య ప్రజల వద్ద, అందినంత దోచుకుంటూ గ్యాస్ బండకి సుమారు అదనంగా వెయ్యి రూపాయలు నుంచి 600 వరకు ఛార్జ్ చేసి వసూలు చేస్తున్నారు..!