హైదరాబాద్ :
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే ‘రూపే ఆన్-ది-గో’ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్డు ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా సులభంగా చెల్లింపులు చేయవచ్చు.
హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ కౌంటర్లలో ఈ కార్డు అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు ఈ కార్డులో గరిష్టంగా రూ.2000 వరకు బ్యాలెన్స్ రీచార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి గరిష్టంగా రూ.500 వరకు లావాదేవీలు చేయడానికి వీలుంటుంది.
ఈ సదుపాయం వల్ల మెట్రో ప్రయాణికులు టికెట్లు కొనుగోలు చేసే సమయంలో ఇంటర్నెట్ సమస్యలు లేకుండా వేగంగా చెల్లింపులు చేయగలుగుతారు. దీంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది..