మళ్లీ పెరిగిన ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర..
19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.42 ధరను పెంచిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
కోల్కతాలో ఈ ధర రూ.53.50 పెంపు
ఐదు కిలోల ప్రీట్రేడ్ ఎల్పీజీ సిలిండర్లపై రూ.11 పెంపు…
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు మరోసారి ధరల భారం పడింది..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) 19కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.42మేర పెంచినట్లు తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది.
కోల్కతాలో ఈపెంపు మరింత ఎక్కువగా ఉండి రూ.53.50గా నమోదైంది.
అలాగే ఐదుకిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ధరను కూడా రూ.11చొప్పున పెంచారు.
అయితే గృహ వినియోగదారులు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
దేశంలో ఎల్పీజీ రిటైల్ ధరలను సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్,భారత్ పెట్రోలియం,హిందూస్థాన్ పెట్రోలియం సంస్థలు సమన్వయంతో నిర్ణయిస్తుంటాయి.
దీంతో ఇతర గ్యాస్ మార్కెటింగ్ సంస్థల ధరల్లో కూడా త్వరలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.