హైడ్రా పెద్దల జోలికి వెళ్లదు..బస్తీలకు వెళ్లి.. వారి ఇళ్లు కూలగొడతుంది… కేటీఆర్.

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ ప్రారంభంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహించనన్నారు. ఈక్రమంలో పార్టీలన్ని అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత పేరు ప్రకటించింది. ఆమె దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య….

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: బీఆర్ఎస్ అభ్యర్థి ఫిక్స్.. మాగంటి భార్యకే అవకాశం

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో జూబ్లీహిల్స్‌‌లో ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది. ప్రస్తుతం పార్టీలన్ని అభ్యర్థులను ప్రకటించే పనిలో తలమునకలయి ఉన్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను ప్రకటించింది. జూబ్లీహిల్స్‌లో గులాబీ జెండా ఎగరవేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు. సునీతను గెలిపించడమే మాగంటి గోపీనాథ్‌కు ఇచ్చే అసలైన నివాళి అన్నారు…
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ ప్రారంభంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహించనన్నారు. ఈక్రమంలో పార్టీలన్ని అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత పేరు ప్రకటించింది. ఆమె దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య.

తెలంగాణ భవన్‌లో బుధవారం నాడు కేటీఆర్ అధ్యక్షతన జూబ్లీహిల్స్‌ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపీనాథ్ భార్య సునీతతో పాటు.. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటిస్తున్నాము అని తెలిపారు. ఆమెకు అందరి ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నాను. జూబ్లీహిల్స్‌ బైఎలక్షన్‌లో మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించడమే గోపీనాథ్‌కు ఇచ్చే సరైన నివాళి అన్నారు కేటీఆర్..ఈ ఉప ఎన్నికలో ఒక్కో ఓటుకు రూ.5 వేలు పంచితే తామే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్క దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. అలానే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా పెద్దల జోలికి వెళ్లదని.. అందుకే సీఎం సోదరుడు చెరువుని ఆక్రమించి ఇల్లు నిర్మించినా పట్టించుకోలేదని.. కానీ పేదల బస్తీలకు వెళ్లి.. వారి ఇళ్లు కూలగొడతుందని కేటీఆర్ విమర్శించారు..