తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయగా.. డిసెంబర్ 15న విచారించనున్నట్టు సివిల్ కోర్టు తెలిపింది…బీఆర్ఎస్ హయంలో మాజీ మంత్రి కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారని.. రాష్ట్రంలో చాలా మంది ఫోన్లను ట్యాప్ చేశారని.. గతేడాది అక్టోబర్ నెలలో కేంద్ర మంత్రి బండి సజయ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ పరువు నష్టం నోటీసులు పంపారు. గడిచిన నెలలో బండి సంజయ్ మరోసారి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ -1 పేపర్ లీకేజీ ఆందోళన సమయంలో తన ఫోన్ ను ట్యాప్ చేసి.. పోలీసులు ముందుస్తుగానే ఇంటికి వచ్చారని బండి సంజయ్ విలేకరుల సమావేశంలో అన్నారు. పేపర్ లీకేజీకి సంబంధించిన కేసులో చివరికు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు సంచలన ఆరోపణలు కూడా చేశారు…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.