రెండు రోజుల క్రితం అదృశ్యమైన మహిళ దారుణ హత్య..!!

*రెండు రోజుల క్రితం అదృశ్యమైన మహిళ దారుణ హత్య*

నల్లగొండ జిల్లా, హాలియాలో చోటు చేసుకున్న దారుణం..

రెడ్డి కాలనీలో నివాసముంటూ.. కూలి పనులు చేసుకుంటున్న సుంకిరెడ్డి అనసూయమ్మ(62)

దేవరకొండ రోడ్‌లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులకు రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చిన మహిళ..

డబ్బులు తిరిగి ఇస్తామని ఇంట్లోకి వెళ్లి.. దారుణంగా చంపి, ఇంట్లోనే పాతి పెట్టిన నిందితులు..

నల్లగొండ జిల్లా (హాలియా): నల్లగొండ జిల్లా హాలియాలోని రెడ్డి కాలనీలో నివసించే 62 ఏళ్ల సుంకిరెడ్డి అనసూయమ్మ అనే వృద్ధురాలు రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. ఆమె వద్ద రూ. 2 లక్షల అప్పు తీసుకున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులు, ఆ డబ్బులు తిరిగి ఇస్తామని నమ్మించి ఆమెను తమ ఇంట్లోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు. ఆధారాలు దొరక్కుండా మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టారు.