నీ మీద, నీ పాలన మీద తిరగబడని వర్గం ఏదైనా ఉందా రేవంత్ రెడ్డి..ఇప్పటికైనా పిచ్చి పనులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలి… హరేష్ రావు…
ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమిని తన రియల్ ఎస్టేట్ దందా కోసం వినియోగించే కుట్రతో ఈ సమస్య మొదలైందన్నారు. ”నీ మీద, నీ పాలన మీద తిరగబడని వర్గం ఏదైనా ఉందా రేవంత్ రెడ్డి..ఇప్పటికైనా పిచ్చి పనులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని, పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి” అని హరీష్ రావు డిమాండ్ చేశారు.
వికారాబాద్ జిల్లా లగ్గిచర్లలో ఫార్మా విలేజ్పై అభిప్రాయ సేకరణ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కలెక్టర్ ప్రతీక్ జైన్పై మహిళా రైతు చేయిచేసుకుంది. వెనుక నుంచి కలెక్టర్ భుజంపై కొట్టడం కలకలం రేపింది. ఫార్మా విలేజ్కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టర్ అధికారుల కార్లపై రాళ్లు రువ్వారు. రైతుల దాడిలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి..