జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ బట్టలు విప్పి బజార్లో నిలబెట్టేందుకు సిద్ధం అంటు ఢిల్లీ వెళ్లిన కేటీఆర్…..
హస్తినా వెళ్లిన విషయం తెల్సుకుని వణికిపోతున్న హస్తం నేతలు..

మేము పేలుస్తామని చెప్పిన బాంబులు, ఢిల్లీ వేదికగా మామీద ఏం పేలుస్తాడోనని లాగులు తడుపుకుని ‘చెయ్యి’ పిసుక్కుంటున్న వైనం..
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. నేను ఇప్పుడే ఢిల్లీలో అడుగుపెట్టాను.. అప్పుడే హైదరాబాద్ ప్రకంపనలు ప్రారంభమైనట్లు తెలిసింది. అప్పుడే వణికితే ఎలా..? అని కేటీఆర్ ప్రశ్నించారు..రేవంత్ అవినీతి, అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.
అమృత్ పథకం టెండర్లలో రేవంత్ తన బావమరది సృజన్ రెడ్డికి లాభం చేకూర్చేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఇప్పటికే ఈ విషయం లేఖ ద్వారా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు కేంద్ర మంత్రిని నేరుగా కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు అంటూ brs పార్టీ నాయకులు తెలిపారు..