హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై క్షిపణి దాడి..ఘటనలో 11 మంది భారతీయ నావికులతో సహా మొత్తం 12 మంది తీవ్రం గాయాలు…!

హర్మూజ్​ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో 11 మంది భారతీయ నావికులతో సహా మొత్తం 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలు, నావికులపై దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్ చేసింది..మంగళవారం హర్మూజ్లో పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ ఆన్ పీస్ (IMO 9893804) అనే నౌకపై క్షిపణి దాడి జరిగింది. దాడి జరిగిన సమయంలో నౌకలో మొత్తం 19 మంది సిబ్బంది ఉన్నారని విదేశాంగ శాఖ తెలిపింది. వీరిలో 17 మంది భారతీయులేనని పేర్కొంది. ఘటనలో 12 మంది గాయపడగా 11 మంది భారతీయ నావికులు చెప్పింది. గాయపడిన వారిని ఒమన్ అధికారుల సహకారంతో సురక్షితంగా తరలించి ఖసబ్‌లో వైద్య చికిత్స అందిస్తున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. క్షతగాత్రులను సకాలంలో స్పందించి సహాయం అందించిన ఒమన్ ప్రభుత్వానికి భారత విదేశాంగ శాఖ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది..