హర్మూజ్‌ జలసంధిని మూసివేస్తే భారత్ కు జరిగేది ఇదే.

ఇరాన్‌ అణుస్థావరాలపై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ పరిణామాల నేపథ్యంలో..ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధిని మూసివేయాలని ఇరాన్‌ పార్లమెంట్‌ (Iran Parliament) ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ విషయంలో తుది నిర్ణయం ఆ దేశ భద్రతా మండలి తీసుకోవాల్సి ఉంది.

ఇరాన్‌ నిర్ణయం ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపనుండటంతో భారత్‌ అప్రమత్తమైంది. కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి (Hardeep Singh Puri) ఈ నేపథ్యంలో స్పందించారు. ”గత రెండు వారాలుగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలను మేము తీవ్రంగా గమనిస్తున్నాం. ప్రధాని మోదీ నాయకత్వంలో.. భారత్‌ చమురు సరఫరాల కోసం వేరువేరు మార్గాలను అభివృద్ధి చేసుకుంది. ప్రస్తుతం హర్మూజ్‌ జలసంధి మీదే పూర్తిగా ఆధారపడుతున్నాం అని చెప్పలేం. మన చమురు కంపెనీల వద్ద చాలినన్ని నిల్వలు ఉన్నాయి. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం.” అని మంత్రి పేర్కొన్నారు.

హర్మూజ్‌ జలసంధి ఒక ముఖ్యమైన సముద్ర మార్గం. ఇది ఒమన్‌, ఇరాన్‌ మధ్య విస్తరించి ఉంది. ప్రపంచ దేశాలకు రోజుకు సుమారు 2.1 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు ఈ మార్గం ద్వారా వెళ్తోంది. ఇది ప్రపంచ మొత్తం ముడి చమురు వినియోగంలో సుమారు 21%. అలాగే ద్రవరూప సహజవాయువు (LNG) సరఫరాలో కూడా 20% హర్మూజ్‌ జలసంధి ద్వారా మాత్రమే జరుగుతుంది.

భారత్‌ రోజువారీ చమురు అవసరాల్లో సుమారు 85% సౌదీ అరేబియా, ఇరాక్‌, యూఏఈ లాంటి గల్ఫ్‌ దేశాల నుంచే వస్తుంది. ఖతార్‌ నుండి వచ్చే ఎల్‌ఎన్‌జీ సరఫరా కూడా ఇదే మార్గంలో జరుగుతుంది. హర్మూజ్‌ మూసివేస్తే భారత్‌లో చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉన్నా, కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని మంత్రి హమీ ఇచ్చారు..

ఎక్కువ రోజులు కొనసాగితే ధరలు పెరిగే అవకాశం...

చమురు ఉత్పత్తిలో సౌదీ, ఇరాన్, యూఏఈ, కువైట్, ఇరాక్ అగ్రస్థానంలో ఉన్నాయి, ఈ దేశాలనుంచే అత్యధికంగా చమురు ఎగుమతి సాగుతోంది. అయితే ఇందులో ప్రపంచ రోజువారీ చమురు అవసరాల్లో 20 శాతం హర్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. ఈ సంధి అరేబియా సముద్రంలో ఒమన్కు చెందిన ముసాండం ద్వీపకల్పానికి, ఇరాన్కు మధ్య ఉన్నది. ఇది అత్యంత ఇరుకైన జలసంధి. ఇందులో ఓ చోట అత్యంత ఇరుకుగా కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇదే మార్గం నుంచి నిత్యం 2 కోట్ల బారెళ్ల చమురు వివిధ దేశాలకు సరఫరా అవుతుంది.

ఇదే మార్గంలో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) అవుతుంది. అయితే ఇపుడు ఈ సంధిని మూసివేస్తే అంతర్జాతీయ వాణిజ్యం పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మనదేశం 90 శాతం ముడి చమురును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. అందులో 40 శాతం హర్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. ఒకవేళ కనుక ఇరాన్ కనుక దీన్ని మూసివేస్తే భారత్ తన 74 రోజుల చమురు నిల్వలను తగ్గించుకోవలసి వస్తుంది. దీనితో పాటు ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లో రూపాయి విలువ పతనం కావడానికి దారితీసిన ఆశ్చర్యం లేదు. ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధర బ్యారెల్కు 90 డాలర్ల వరకు పలుకుతోంది. ఈ సంధిని మూసివేస్తే ధర మరింత పెరిగి భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.

మన దేశం సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ దేశాల నుంచి అత్యధికంగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ చమురు నౌకలన్నీ కూడా హర్మోజ్ జల సంధినుంచే ప్రయాణిస్తుంటాయి. ప్రపంచ దేశాలు వినియోగించే ఎల్ఎన్జీ లో 20శాతం ఇక్కడ నుంచే సరఫరా జరుగుతోంది. వీటిని తీసుకు వచ్చే నౌకలన్నీ హర్మూజ్ జలసంధి నుంచే రవాణా చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో హర్మోజ్ జల సంధిని మూసివేయాలని ఇరాన్ నిర్ణయం తీసుకుంటే ఆ ప్రభావం మనదేశం మీద తీవ్రంగా పడే అవకాశం ఉంది. దీనివల్ల మనదేశంలో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. నిత్యవసరాలైన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ తదితర ధరలు ఆకాశాన్నంటుతాయి..