హర్యానాలో దారుణం.. ఎల్‌కేజీ చిన్నారిపై 3వ తరగతి బాలుడి దాడి!

హర్యానాలో దారుణం.. ఎల్‌కేజీ చిన్నారిపై 3వ తరగతి బాలుడి దాడి!

హర్యానాలోని పంచకులాలో ఉన్న సంస్కృతి మోడల్ స్కూల్‌లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిని 3వ తరగతి విద్యార్థి తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

హర్యానాలోని పంచకులెక్టరు-20లో గల సంస్కృతి మోడల్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలుడు, కేజీ చదువుతున్న 6 ఏళ్ల ప్రత్యేక అవసరాలు గల (దివ్యాంగురాలు) చిన్నారిపై అత్యంత దారుణంగా దాడి చేశాడు…

2026, అక్టోబర్ 28న పాఠశాల తరగతి గదిలో ఈ భయంకరమైన ఘటన జరిగింది..

ఈ ఘటనకు సంబంధించిన ముఖ్య వివరాలు:
దాడి జరిగిన తీరు: క్లాస్‌రూమ్‌లో ఉపాధ్యాయులు ఎవరూ లేని సమయంలో సదరు బాలుడు చిన్నారి జుట్టు పట్టుకుని బెంచ్‌కేసి బలంగా బాదాడు.

ఆపై కిందపడిపోయిన చిన్నారిని కాళ్లతో తన్నుతూ, క్లాస్‌రూమ్‌లో ఉన్న ఇటుకలు, కుండీలతో ఆమె తలపై దాడి చేశాడు. ఆ చిన్నారి స్పృహ తప్పి పడిపోయినా కూడా వదలకుండా దాదాపు 12 సార్లు ఇటుకతో కొట్టి, గదిలో ఈడ్చుకెళ్లాడు…