బంగాళాఖాతంలో అల్పపీడనం, తుఫాన్‌గా మారే అవకాశం..
మరో 6 గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం.
రేపు సాయంత్రానికి తుఫాన్‌గా మారే అవకాశం.
ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న తుఫాన్
సోమవారం ఏపీ తీరానికి తుఫాన్ చేరే అవకాశం.
సోమ, మంగళవారాల్లో ఏపీలో భారీ వర్షాలు.
సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమకు భారీ వర్ష సూచన.
పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్న అధికారులు..
దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకొని ఉన్న నికోబార్ దీవులపై కేంద్రీకృతమైన అల్పపీడనం శనివారం ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆ తరువాత రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఏపీ తీరం వైపు కదిలే చాన్స్ ఉందని, దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
శనివారం (31-10-2026) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు సైతం కురిసే చాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వర్షాలతోపాటు తీవ్ర స్థాయిలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అంచనా వేశారు.
భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, పెద్దపెద్ద హోర్డింగ్స్ ఉన్న ప్రాంతాల్లో వేచిఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులకు సూచించారు.
మరోవైపు.. శుక్రవారం ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6గంటల సమయం వరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నగరంలో 91.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా.. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 81.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లి జిల్లా చోడవరంలో 80.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది…
Telangana తెలంగాణ లో వర్షాలు…
తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో రేపటి నుంచి 4వ తేదీ వరకు వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఇవాళ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌తోపాటు యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నవంబర్ 2, 3 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది…..