చిరుతతో హోలీ….

సోషల్ మీడియాలో ప్రతిరోజు బోలేడు వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని నవ్వుతెప్పించేవిగా ఉంటే మరికొన్ని వీడియోలు ఆశ్చర్యంకు గురిచేసేవిగా ఉంటాయి. ఇటీవల అడవిలోని జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి. పులులు, చిరుతలు, సింహాలు, పాములు, కొండ చిలువలు ఏకంగా గ్రామాల్లోకి వస్తున్నాయి. అవి మనుషులపై, పెంపుడు జంతువులపై దాడులు చేసి వాటిని తినేస్తున్నాయి. అంతే కాకుండా అవి కాల్పులలో కూడా ప్రాణాలు ఒదిలిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో దేశ మంతట ఎక్కడ చూసి హోలీ వేడుకల్లో జనాలు బిజీగా ఉన్నారు…

ఏదైన వీడియోని ఒకటికి రెండుసార్లు చూసి ఏదో నిజం, ఏది అబద్ధం చెక్‌ చేసుకోండి. ఎందుకంటే మీరు కూడా ఈ చిరుతపులి నిజమని నమ్మితే ప్రమాదం. సరద కోసం ఇలాంటి ట్రై చేశారంటే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. హోలీ వేళ మీలో మీరు రంగులు చల్లుకుంటే పర్వాలేదు.. కానీ, ఇలాంటి ప్రమాదకరమైన జంతువులతో ఆటలు మీ ప్రాణాలకే ప్రమాదం కావొచ్చు. ముఖ్యంగా కొన్న జర్మన్ షెపర్డ్, పిట్‌బుల్‌ రకం వంటి పెంపుడు కుక్కలతో కూడా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీహార్ పేరుతో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియో ఒకటి అందరినీ అయోమయం గందరగోళంలోకి నెట్టివేస్తుంది…వైరల్ వీడియోలో చీతా ఒకటి బిహార్‌లోని ఒక గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చింది. దాంతో గ్రామవాసులంతా కలిసి ఆ చీతాతో హోలీ ఆడినట్టుగా వీడియోలో కనిపిస్తుంది. అయితే, వాస్తవం అది కాదు..ఈ వీడియో పూర్తిగా AI క్రియేషన్‌. CGI (కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెస్) ఆధారంగా తయారైంది. స్థానిక అధికారులు కూడా దీన్ని ధృవీకరించారు. ఏ చీతా కూడా గ్రామంలో హోలీ ఆడేందుకు రాలేదని స్పష్టంచేశారు..