ఇటుక బట్టీ లతో కాలుష్యం..ఇటుక బట్టీలో మసిబారుతున్న బాల్యం పట్టించుకోని అధికారులు.

ఇటుక బట్టీలో మసిబారుతున్న బాల్యం పట్టించుకోని అధికారులు

అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలపై చర్యలు తీసుకోవాలి

అక్రమంగా చెరువు మట్టి, విద్యుత్తు వినియోగం..?

*వాహనదారులకు దుమ్ము, ధూళి, పొగ*

హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా రోడ్ల పక్కనే ఇటుక బట్టీలు వాహనం దారులని తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్న కనీసం ఆ వైపు కూడా అధికారులు చూడకపోవటం పై పలు అనుమానాలకు తగిస్తుంది…. కళ్ళల్లో బూడిద పడుతూ చాలా రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయి.. ఆ పొగతో దుమ్ము దూళితో శ్వాస కోస సంబంధిత వ్యాధులు కూడా వస్తున్నాయి..
ఆయన స్పష్టంగా అధికారుల అలసత్వం కనబడుతూనే ఉంది ఇది ఇలా ఉండగా.
నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామ శివారులో గ్రామపంచాయతీ అనుమతి లేకుండా లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలలో ఇతర రాష్ట్రాల నుంచి తల్లిదండ్రులతోపాటు వచ్చిన వారి పిల్లలు చదువు సంధ్య లేకుండా బాల కార్మికులుగా ఇటుక బట్టీలలో పనిచేస్తున్నారని, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటుక బట్టీల యాజమాన్యం నిబంధనలు పాటించకుండా అక్రమంగా చెరువు మట్టి, విద్యుత్తును వినియోగించుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. గ్రామపంచాయతీ అనుమతి లేకుండా, గ్రామపంచాయతీ ఆదాయానికి గండి కొడుతూ సంబంధిత అధికారులకు ముడుపులు చెల్లిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. జానపాడు నుండి నేరేడుచర్లకు వెళ్లే రోడ్డు పక్కన ఇటుక బట్టీలు నిర్వహించడం వల్ల దుమ్ము, ధూళి, పొగతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు కనీస వేతనం ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ బాలలకు నిర్బంధ ఉచిత విద్య అందుబాటులో లేదు. అక్షరాలు దిద్దాల్సిన చేతులు మట్టి కలిపి ఇటుకలు చేస్తున్నాయి.బాల కార్మిక చట్టాలు ఏం చేస్తున్నాయి. వీరి కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయాలి.
*బాలల హక్కులకు రక్షణ కల్పించాలి:* పుస్తకాలు పట్టాల్సిన బాల్యం నేడు ఇటుక బట్టీలలో మట్టి కలుపుతూ, ఇటుకలు మోస్తూ మగ్గిపోతోంది. ఇటుక బట్టీలో బాల్యం బుగ్గి అవుతుండగా ఆ చిట్టి చేతులు చక్కని రాతకు చదువుకు దూరమవుతున్నాయి. ఒక వైపు కార్మికులకు చానీ చాలని జీతాలు ఇస్తూ వారి శ్రమను దోపిడీ చేస్తున్న యజమానులు అది చాలనన్నట్లు చిన్నారులను శ్రమ జీవులుగా మార్చి వేస్తున్నారు. ఇటుకలను తయారీలో నిమగ్నమయ్యారు.ఇటికలు తయారు చేయుటకు కావలసిన మట్టిని కలుపుతూ ఇటుకలను పేరుస్తూ పెద్దలకు ఇటుక పనిలో సహకరించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అక్షరాల దిద్దాల్సిన చేతిలో ఇటుకలు ఉండటం పలువురి హృదయాలను కలచివేస్తోంది. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ బట్టి లో ప్రతిరోజు ఉదయం. సాయంత్రం చిన్నారులు పనిచేస్తున్నారని ఇతర రాష్ట్రాల నుంచి, వేరే జిల్లాల నుంచి కార్మికులు ఇక్కడికి వచ్చి నెలల తరబడి ఉండడంతో వారితో పాటు చిన్నారులు ఇటుక బట్టీలలోనే వలస కార్మికులుగా తయారవుతున్నారు అని, యజమానులు ధనార్జనే ధ్యేయంగా చిన్నారులను సైతం కార్మికులుగా మారుస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేటి బాలలే భావి భారత పౌరులు అని నానుడి పోయి ఈ బట్టి లలో చిన్నారులు రేపటి కార్మికులుగా తయారవుతున్నారు. ఒకవైపు అక్రమంగా వ్యాపారం చేస్తూ మరోవైపు చిన్నారులను సైతం విచ్చలవిడిగా వెట్టిచాకిరి చేయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కొత్త వ్యక్తి బట్టి వైపు వెళ్తే చిన్నారులు ఎవరికీ కనబడకుండా చిన్న చిన్న గుడిసెల్లో దాచుకోవడం పరిపాటిగా మారిందని స్థానికులు అంటున్నారు. అధికారులు ఎవరు అటువైపు చూడరని, నిర్వాహకుల నుండి నెల నెల ముడుపులు భారీగా అందుతున్నాయని స్థానికుల నుండి వెల్లువెత్తుతున్న విమర్శలు, నాయకుల అండదండలు అధికారుల నిర్లక్ష్య ధోరణి వలన ఇటుక బట్టీలు నిర్లక్ష్యంగా విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముడుపుల మత్తులో ప్రశ్నించే వారు లేక ఇష్టానుసారంగా బట్టి నిర్వహిస్తున్నారని, ప్రధాన రహదారిని అనుకుని ఉన్న ఈ బట్టి వైపు ఏ ఒక్క అధికారి గానీ అటువైపు చూడకపోవడం బాధాకరమని, ఉదయం సాయంత్రం బట్టిలలో పదుల సంఖ్యలో చిన్నారులు పని చేస్తు కనబడటం వాహనదారులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అధికారులు స్పందించి చిన్నారులను వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించాలని పసి హృదయాలను శ్రమజీవులుగా మారుస్తున్న అటువంటి యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బడిఈడూ పిల్లలు బడిలో చదువు నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో 6-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను ప్రభుత్వం అందిస్తుంటే అది అమలు పరచడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. బాల కార్మిక వ్యతిరేక చట్టం బాలకార్మికుల నిర్మూలనే ధ్యేయంగా ప్రతి సంవత్సరం జూన్ 12 న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న వివిధ సంఘాలు స్వచ్చందంగా పని చేస్తున్న క్షేత్ర స్థాయిలో అమలుకావడం లేదు. ప్రధాన రహదారి వెంట నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేరిన బట్టీలో పదుల సంఖ్యలో చిన్నారులు మగ్గిపోతున్నా, చదువులకు దూరం అయ్యి భవితవ్యం ఛిద్రమవుతున్నా బట్టి యజమానులు స్వార్ధ ప్రయోజనాలకు, ధనార్జనే ధ్యేయంగా చిన్నారులను కార్మికులుగా మారుస్తున్న అధికారులు అటువైపు గాని చూడకపోవడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఏటా ఆపరేషన్ స్మైల్ పేరుతో చదువుకు దూరం అవుతున్న చిన్నారులను గుర్తించక పోవడం అధికారుల నిర్లక్ష్యం అని ప్రజలు ఆరోపిస్తున్నారు. బట్టీ నిర్వాహకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నా చిన్నారుల బాల్యాన్ని బట్టీలలో ఇటుకలు తయారీకి వినియోగిస్తున్న అధికారులు తనిఖీలు నిర్వహించక పోవడం చర్యలు చేపట్టకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బట్టి నిర్వాహకులు ఇచ్చే ముడుపులు అందుకోవడం వలనే ఇటుక బట్టీల వైపు అధికారులు చూడడం లేదని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి నెలనెలా మామూళ్లు మత్తులో సంబంధిత అధికారులు ఉండడం వల్లనే నేడు బట్టీల లో బాల కార్మికులు పెరిగారని వారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు చిన్నారుల భవిష్యత్తు అంధకారంలో పడకుండా చదువు వైపు దృష్టి సారించేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

దిర్శించర్ల గ్రామపంచాయతీ కార్యదర్శి వివరణ:.

గ్రామపంచాయతీ నుండి ఇటుక బట్టీలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని గ్రామపంచాయతీ కార్యదర్శి వివరించారు..

సేకరణ..
షేక్. మహబూబ్ అలీ.
నేరేడుచర్ల. పాలకిడు.

A TO Z వార్తల సమాచారం మాకు అందించారు అనుకున్న వారు..
వాట్సప్..+91 91330 57959.