*ఘనంగా ఆర్యవైశ్య వనభోజన కార్యక్రమం..

R9TELUGUNEWS.COM
కార్తిక పర్వదిన రోజులను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మాదిరిగానే పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కల్వకొలను రామనాథం ప్రసాద్ గారి మామిడి తోటలో కార్తీక వనభోజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఉదయం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కుటుంబ సమేతంగా నిర్వహించారు తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం అన్ని రంగాల్లో ఆదుకోవాలని కోరారు నామినేటెడ్ పదవుల్లో ప్రముఖ దేవాలయాల యాదగిరి లక్ష్మీనరసింహస్వామి భద్రాది రామయ్య మట్టపల్లి లక్ష్మీనరసింహ తెలంగాణలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలైన దేవాలయాల్లో పలు నామినేటెడ్ పదవులు కేటాయించాలని వారు కోరారు అనంతరం ఆటపాటల సాంస్కృతిక కార్యక్రమాలు పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఓరుగంటి నరసింహారావు ,,ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి లక్ష్మీ నరసింహారావు , చైర్మన్ గెల్లి అర్చన రవి,కుక్కడపు రామ్మోహన్రావు,తొడుపునూరి శేఖర్ ఓరుగంటి మట్టయ్య , కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు , గజ్జి ప్రభాకర్ ,గెల్లి అప్పారావు ,గుండా రమేషు చిల్లం చర్ల ఆనంద్ , కామిశెట్టి నందయ్య , జిల్లా అధ్యక్షులు మాశెట్టి అనంత రాములు , నీరుమళ్ళ నరసింహారావు, పోలిశెట్టి వెంకటేశ్వర్లు , కౌన్సిలర్ వీర్లపాటి గాయత్రి భాస్కర్ ,ఏలూరి రాంబాబు ,బచ్చు రామారావు, పేరూరి అశోక్, మహిళలు తదితరులు పాల్గొన్నారు…
108 సిబ్బంది సహాయం తో ఆడబిడ్డ కి జన్మనిచ్చిన తల్లి..

సూర్యాపేట జిల్లా.
R9TELUGUNEWS.COM
మఠం పల్లి మండలం బొజ్జ తండా గ్రామానికి చెందిన అజ్మీరా రోజా కి పురిటి నొప్పులు రావడం తో 108 కి ఫోన్ చేసిన కుటుంబ సభ్యులు
108 వాహనం ద్వారా హుజుర్ నగర్ ఏరియా ఆసుపత్రి కి తరలిస్తుండగా మఠం పల్లి మండలం పెదవీడు సమీపంలో నొప్పులు ఎక్కవ కావడం తో 108 సిబ్బంది సహాయం తో ఆడబిడ్డ కి జన్మనిచ్చింది..తల్లి, బిడ్డ క క్షేమంగా ఉన్నారు
తల్లి, బిడ్డ ను హుజుర్ నగర్ ఏరియా ఆసుపత్రి కి తరలించడం జరిగింది.. ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారు అని వైద్యులు తెలిపారు…
కార్తీక వనభోజనాలు..

R9TELUGUNEWS.COM
పట్టణంలోని పాత బజార్ లో గల గౌడ కులస్తులు ఆదివారం కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా రామస్వామి గుట్ట వద్ద గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు మహిళలకు చిన్నారులకు క్రీడా పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు కార్యక్రమాలలో పాలకూరి బాబు, సోమ గాని రామన్న, సోమ గాని కృష్ణమూర్తి, గుండు వెంకటేష్, నాగార్జున, చెన్న గాని సైదులు, పుల్లెంల విజయ్, సోమ గాని లక్ష్మమ్మ, నాగయ్య, నవీన్ సోమగాని వంశ బంధువులు చెన్నగాని, కారింగుల, పాలకూరి, గుండు, పుల్యాంల, పోలగాని, వల్లపుదాసు, ఐల కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…
రాష్ట్రము చివరిలో ఉన్న చింతలపాలెం మండలాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతా...
సూర్యాపేట జిల్లా…..
*రాష్ట్రము చివరిలో ఉన్న చింతలపాలెం మండలాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతా………
*అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇల్లులు……
*మూడు దశబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొన్ని చూసుకుంటున్నారు….
R9TELUGUNEWS.COM
చింతలపాలెం మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకి, రోడ్ల నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన
రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..
రాష్ట్రము చివరలో ఉన్న చింతలపాలెం మండలాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం చింతలపాలెం మండల కేంద్రంలో2.62 కోట్ల రూపాయలతో నిర్మించే తహసీల్దార్ కార్యాలయం, 2.98 కోట్ల రూపాయలతో నిర్మించే మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం,2.38 కోట్ల రూపాయలతో నిర్మించే పోలీస్ స్టేషన్ కార్యాలయాల భవనాలకు అలాగే 10 కోట్ల రూపాయలతో మేళ్లచెరువు నుండి చింత్రియాల రోడ్డుకి మేళ్లచెర్వు నుండి 8.6 కి. మీ రోడ్డు బలపర్చటం, 1.4 కి. మీ రోడ్డు వెడల్పు చేసే నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. ముందుగా చింతలపాలెం మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు మూడు దశబ్దాలుగా నన్ను గుండెల్లో పెట్టుకొన్ని చూసుకుంటున్నారని వారికి అన్ని మౌళిక వసతులు ఏర్పాటు చేసేందుకు నేడు నూతన కార్యాలయాల నిర్మాణ పనులకు అలాగే రోడ్లకి శంకుస్థాపన చేయటం నాకు చాల సంతోషంగా ఉందని అన్నారు. నేను మొదటి సారి ఎమ్మెల్యే గా గెలిచినప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం రోడ్లు వేపించానని, లిప్ట్ ఇరిగేషన్ ల ద్వారా రైతులకి సాగు నీరు వసతి ఏర్పాట్లు చేశామని అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని తీసుకొచ్చి అంబేద్కర్ విగ్రహం అలాగే అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు.
రాష్ట్రము లో ప్రజా ప్రభుత్వం నడుస్తుందని అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇల్లులు నిర్మిస్తామని తెలిపారు.
మీ జీవితాలు బాగుపడి మీ కుటుంబాలు సంతోషంగా ఉండేందుకు..ఈ ప్రాంతాన్నికి అన్ని మౌళిక వసతులు ఏర్పాటు చేసి అభివృద్ధి పర్చి ప్రజల ఆస్తులు రెట్టింపు చేసేందుకు మీ ఉత్తమన్న నిరంతరం కృషి చేస్తాడని మంత్రి అన్నారు.
సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించటం జరిగిందని 48 గంటలలో రైతులకు 100 కోట్ల రూపాయలు జమ చేయటం జరిగిందని తెలిపారు. చింతలపాలెం మండలంలో
సి సి ఐ ద్వారా రెండు ప్రత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కొనుగోలు కేంద్రాలలో ఏమైనా సమస్యలుంటే పరిష్కరిస్తామని అన్నారు.
అనంతరం కిష్టాపురం క్రాస్ రోడ్ వద్ద 15 కోట్ల రూపాయలతో పి ఆర్ సిమెంట్ క్రాస్ రోడ్డు నుండి కిష్టాపురం క్రాస్ రోడ్డు వరకు 10.5 కి. మీ. లు రోడ్డు వెడల్పు చేసే పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులకు సూచించారు.అలాగే లిప్ట్ లకి సంబందించిన ఏమైనా సమస్యలు ఉంటే అధికారులకి తెలియపరిస్తే మరమ్మత్తులు చేపిస్తానని మంత్రి హామి ఇచ్చారు..
ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పి నాగేశ్వరావు,హుజూర్నగర్ ఆర్ డి ఓ శ్రీనివాసులు,ఆర్ & బి ఎస్ ఈ సత్యనారాయణ రెడ్డి, ఈ ఈ సీతారాం,డి ఈ పవన్ కుమార్, ఎ ఈ సతీష్ కుమార్, తహసీల్దార్ సురేందర్ రెడ్డి, ఎంపిడిఓ భూపాల్ రెడ్డి,ఆర్ ఐ వాసుదేవరావు, అధికారులు,సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

R9TELUGUNEWS.COM
వివేక వర్ధిని ఉన్నత పాఠశాల
1998- 99 పదవ తరగతి బ్యాచ్
మఠంపల్లి నవంబర్ 24 వెలుగు నిఘా
నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని గ్రీన్ మ్యాంగో ఫామ్ హౌస్ లో ఆదివారం 25 సంవత్సరాల సందర్భంగా సిల్వర్ జూబ్లీ ని 1998-99 సంవత్సరం సంబంధిత పదవ తరగతి 65 విద్యార్థులు మఠం పల్లి వివేక వర్ధిని ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. పాఠశాలలో జరిగిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయులను స్మరించుకున్నారు. నాటి విద్యా బోధన తో నే నేడు ఉన్నత స్థాయికి ఎదగడం జరిగిందని గురువులను కొనియాడారు. 25 సంవత్సరాల అనంతరం విద్యార్థులందరూ కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి కత అనుభవాలను నెమరు వేసుకున్నారు. 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరు ఒకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులు పంచుకొని రోజంతా ఆనందంగా గడిపారు. ఒకే పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఒకచోట కలుసుకొని ఒకరికొకరు యోగక్షేమాలు తెలుపుతున్నారు. రోజంతా ఆటపాటలతో, ముఖ్యంగా బతుకమ్మ ఆట పాటలతో అలరించారు…
వానకాలం పండిన పంట, ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
సూర్యాపేట జిల్లా…
హుజూర్ నగర్…

R9TELUGUNEWS.COM
హుజూర్ నగర్ పట్టణం, కౌడిన్య పంక్షన్ హల్లో, తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, హాజరయ్యారు. వారితోపాటు కలెక్టర్ నందలాల్ పాటేల్, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, రాష్ట్ర సాంస్కృతిక అకాడమి చైర్మన్, డా”అలైఖ్య ప్యుంజుల,రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామెల్, తదితరులు హాజరైయ్యారు..
*మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్*:-
కెసిఆర్ నియంతృత్వ పాలన నుంచి, తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగి డిసెంబర్ 7తో సంవత్సర కాలం పూర్తవుతుంది..
ప్రజాపాలన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు పూర్తిగా బస్సు ప్రయాణం ఉచితం చేయడం జరిగింది.
గత పాలకులు నిరుద్యోగ యువతను పూర్తిగా మోసం చేశారు.
గత పది సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం,రెండు లక్షలు ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు.
రేవంత్ రెడ్డి నేతృత్వలోని ప్రజా ప్రభుత్వం,కేవలం 10 నెలలోనే,50వేల ఉద్యోగాలను భర్తీ చేసింది అన్నారు.
స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలోని లేనివిధంగా,
21 వేల రైతులకు, రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేశాం.
మిగిలిన రైతులకు కూడా డిసెంబర్ ,జనవరి లోపు పూర్తి చేస్తామన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్లు ఖర్చుపెట్టి, నాసిరకంగా నిర్మించారు…
గత ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసింది.
స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, తెలంగాణ రాష్ట్రంలో, 153 లక్షల మెట్రిక్ టన్నుల, ధాన్యం పండింది.
వరిలో సన్న రకానికి కింటాకు 500 బోన్స్ ఇస్తున్నాం.
తొందరలోనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చి, ఒక్కొక్క వ్యక్తికి, ఆరుకిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు.
వానకాలం పండిన పంట, ప్రతి గింజను కొనుగోలు చేస్తాం..
నిరుపేద పిల్లలకు అత్యున్నత విద్య అందుబాటులో తీసుకురావాలని, హుజూర్ నగర్ ,కోదాడలో 300 కోట్లతో అద్భుతమైన ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం..
హుజూర్ నగర్ కు రైల్వే తీసుకరాబోతున్నాము.
బీసీలకు న్యాయం చేయడానికి కులగణన కార్యక్రమం చేపట్టాం..
గత ప్రభుత్వం ఓటమిని జీర్ణించుకోలేక, పసలేని ఆరోపణలు చేస్తుంది అన్నారు.
హుజూర్ నగర్, కోదాడ ప్రజలే మా కుటుంబం.
*అలేఖ్య ప్యుంజల కామెంట్స్*:-
ప్రజా ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకాన్ని ,మాటా బాట రూపంలో ప్రజల్లోకి తీసుకపోతున్నాం.
ఇంత మంచి కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించినందుకు,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ప్రత్యేక ధన్యవాదాలు..
*ఎమ్మెల్యే మందుల సామేల్ కామెంట్స్*:-
వేలాది అమరుల త్యాగ ఫలం, సోనియమ్మ సలువ తెలంగాణ రాష్ట్రం.
తెలంగాణలో ఫాసిస్టు పాలన పోయి ,ప్రజాపాలన వచ్చింది..
కెసిఆర్ పాలనలో, తుంగతుర్తి లో,ఇసుక మాఫియా యధా స్వేచ్ఛగా సాగింది..
పేద ప్రజలకు భూములను, పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.
కాంగ్రెస్ పార్టీ నిండు బిందె కింద పడితే చొట్టుపడుద్ది కానీ పగిలిపోదు. బిఆర్ఎస్ పార్టీ గాజు గిన్నె లాంటిది, క్రింద పడితే పగిలిపోద్ది.
*రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్, పటేల్ రమేష్ రెడ్డి కామెంట్స్*:-
60 సంవత్సరాల ప్రజల ఆకాంక్షలను,1200 మంది అమరుల త్యాగాలను స్మరించుకుంటూ,నేడు ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ సభను నిర్వహించుకుంటున్నాము.
గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో విధ్వంస పరిపాలన జరిగింది.
కాంగ్రెస్ పార్టీ,ప్రజా ప్రభుత్వంలో,సంవత్సర కాలంలోనే అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, వంద రోజులలో పూర్తిచేసి ప్రజల అభిమానాన్ని గైకొంది.
రైతులందరికీ ఎక్కడలేని విధంగా,రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది.
మహిళలకు ఉచిత ప్రయాణం, పేదలకు కార్పొరేట్ వైద్యం,500కే మహిళలకు గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల గృహా ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది..
నిరుద్యోగులకు సంవత్సర కాలంలోనే, 50వేల ఉద్యోగాలను, ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి,దక్కిందని అన్నారు.
ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అన్నారు..
మూసి ప్రక్షాళన అనేది మంచి కార్యక్రమం
మూసి ప్రక్షాళన చేసి స్వచ్ఛమైన మంచినీరు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు, అందించాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం..
రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం, ఎలాంటి అవినీతి లేని పాలన అందిస్తుంది..
*ఈ కార్యక్రమం అనంతరం కల్యాణ లక్ష్మి చెక్కులను, గౌడన్నలకు తాటి చెట్లు ఎక్కే కిట్లను,వికలాంగులకు ట్రై సైకిలను అందించడం జరిగింది..
అంతకు ముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్.
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మంత్రి ఉత్తమ్ ఆకస్మిక తనిఖీలు.
కొనుగోలు కేంద్రానికి చేరుకున్న మంత్రి ఉత్తమ్ ను చూసి అవాక్కాయిన రైతులు
ధాన్యం దిగుబడి బాగా వచ్చిందంటూ మంత్రి ఉత్తమ్ కు చెప్పిన రైతులు
రైతుల వద్ద నుండి ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ పై మంత్రి ఆరా తీశారు..
సమయానికి లారీలు రావడం లేదంటూ మంత్రికి ఫిర్యాదు..
తక్షణం స్పందించి ఉన్నతాధికారులకు ఫోన్ లో మాట్లాడిన మంత్రి ఉత్తమ్
ట్రాన్స్పోర్ట్ లో జాప్యం తగదని అధికారులకు హితవు
తేమ శాతం యంత్రాన్ని పరిశీలన
ఇతర ఏర్పాట్లపై రైతులను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి ఉత్తమ్.