*సూర్యాపేట జిల్లా* …. హుజూర్ నగర్ లో బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ముందస్తు అరెస్టు..
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని రాత్రి అక్రమ అరెస్టులు చేశారని.. బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు పట్టణం లొ నిరసన కార్యక్రమాలు చేయబోతున్నారని ముందస్తు సమాచారం తెలుసుకున్న పోలీసులు తెల్లవారుజామునే బిఆర్ఎస్ శ్రేణుల ఇళ్లకు చేరి అక్రమ అరెస్టులు చేయడం జరిగింది…
అరెస్టులను ఖండిస్తూ బిఆర్ఎస్ నాయకులు జక్కుల నాగేశ్వరరావు, బెల్లం కొండ అమర్ మాట్లడుతూ……
కాంగ్రెస్ పార్టీ పోలీసులను చేతిలో పెట్టుకొని రాజకీయం చేస్తుందని.. బిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఎప్పుడూ కూడా పోలీసులని స్వలాభాలకు వాడుకోలేదని తెలిపారు.. పాడి కౌశిక్ రెడ్డినీ అరెస్టు చేయడం అప్రజా స్వామికమని. అరెస్టును ఖండిస్తున్నట్లు బిఆర్ఎస్ నాయకులు తెలిపారు.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజాల నుండి వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు … అరెస్ట్ అయిన వారిలో ములకలపల్లి రాంబాబు జడ అంజి యాదవ్ కష్టాల రామకృష్ణ గొబ్బి రాము మేరిగా సాయి వేముల అఖిల్ గుండు సైదులు తదితరులను ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది..