ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తప్పని సరిగా స్థానిక పోలీస్టేషన్ లో వారి వివరాలు అందించాలి.. సీఐ చరమంద రాజు..!
హుజూర్ నగర్ సర్కిల్ర పరిధిలోని
హుజూర్నగర్, గరిడేపల్లి మండలాల్లో బేకరీలు,టీ స్టాల్స్, ఇటుక బట్టీలలో పనిచేసే కేరళ, ఒరిస్సా,, రాజస్థాన్,, చత్తీస్గడ్, రాష్ట్రాలకు చెందిన 35 మందిని సత్ప్రవర్తన నిమిత్తమై పోలీస్ స్టేషన్ పిలిపించివారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.. అనంతరం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో బైండోవర్ చేయడం జరిగింది..
ఈ సందర్భంగా సీఐ చరమందరాజు మాట్లాడుతూ… బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తప్పని సరిగా స్థానిక పోలీస్టేషన్ లో వారి వివరాలు ఇవ్వాలన్నారు. వారిని హుజూర్ నగర్ తహసిల్దార్ ముందు బైండోవర్ చేసి, వారి యొక్క ఫింగర్ ప్రింట్స్, ఆధార్ కార్డు కూడా కలెక్ట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో హుజూర నగర్ ఎస్ఐ చలికంటి నరేష్, గరిడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.