మామిడికాయ కోసం వెళితే.. బంగారు గొలుసు చోరీ …!

బైక్ పై వచ్చిన ఓ దుండగుడు.. మామిడికాయ కోసం వెళ్లిన ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని తిలక్ నగర్ లో జరిగింది. చోరీ చేసిన ఆ దుండగుడు క్షణాల్లోనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాలో నమోదయ్యాయి. తమ ఇంటికి సమీపంలో ఉన్న చెట్టు నుంచి మామిడికాయ రాలితే తీసుకునేందుకు వెళ్లానని బాధితురాలు ఓడ్నాల భూలక్ష్మి తెలిపారు. తిరిగి వస్తుండగా దుండగుడు గొలుసు లాక్కెళ్లాడని వాపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.