పోలీసుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు,,నలుగురి అరెస్ట్..

*పోలీసుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు*

*నలుగురి అరెస్ట్*

*పోలీస్ అంటు కేటుగాళ్లు గోల్డ్ షాప్*
*ఓనర్ కి ఫోన్ కాల్.*

*వైరల్ ఆడియో..*

*గోల్డ్ షాప్ యజమానితో ఫోన్ మాట్లాడిన ఫేక్ పోలీస్ ఆడియో..!*

https://youtu.be/mDYlzM6GICY?si=oD0yaE7xPPaf-YLK
సూర్యాపేట జిల్లా.. హుజూర్ నగర్ లో పోలీసుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురిని హుజూర్నగర్ పోలీసులు అరెస్ట్ చెసి రిమాండ్ కు తరలించిన.. పోలీసులు… వివరాలను సీఐ చర మందరాజు విలేకరుల సమావేశంలో వెల్లడిం చారు. నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన చింతలచెర్వు ప్రశాంత్ (24), షేక్ ఇర్ఫాన్ (26), చింతలచెర్వు అక్షిత్ కుమార్ (21), నల్లగొండకు చెందిన షేక్ వాజీద్ (22) చెడు అలవాట్లకు బానిసలుగా మారారు. సులభంగా డబ్బు సంపాదించా అనే లక్ష్యంతో ఏడాది కాలంగా పోలీసుల మని చెప్పి పలువురు బంగారం షాపుల యజమానులను బెదిరించడం చేస్తున్నారు. ఫలానా స్టేషన్ ఎస్ఐ మాట్లాడుతున్నా అని, కొంతమంది దొంగలను పట్టుకున్నామని, రు మీ బంగారం షాపులో దొంగ బంగా కాన్ని అమ్మారని, ఆ బంగారాన్ని తిరిగి ఇవ్వా అని, లేకపోతే కేసు పెట్టి జైలుకు పంపుతా మని బెదిరించి వారి నుంచి డబ్బులు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా తీసుకునేవారు. ఈ క్రమంలోనే ఈ నెల 1న తిరుమలగిరికి చెందిన శివకుమార్ అనే బంగారం షాపు

యజమానికి ప్రశాంత్ ఫోన్ చేసి రాజాపేట ఎస్ఐని మాట్లాడుతున్నా అని చెప్పాడు. నీవు దొంగల వద్ద బంగారం కొనుగొలు చేశావు, కేసు కాకుండా ఉండాలంటే రూ.లక్ష ఫోన్ పే చేయాలని అడగగా అతడు భయపడి రూ.52 వేలు పంపించాడు. అదేవిధంగా 8వ తేదీన హుజూర్నగర్కు చెందిన శ్రీనిధి జ్యూవెలరీస్ యజమాని నవీన్కమార్కు ఫోన్ చేసి కుప్పం ఎస్ఐ అని చెప్పి బెదిరింపులకు పాల్పడి రూ.10 వేలు ఫోన్ పే చేయించుకు న్నారు. యజమానికి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం మండలంలోని గోపా లపురం గ్రామ శివారులో పోలీసులు వాహ నాల తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై కోదాడ వైపు వెళ్తుండగా ఆపి విచారించగా నేరాన్ని అంగీక రించారు. నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, 4 సెల్ ఫోన్లు, రూ.24,900 నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్ల డించారు. సమావేశంలో ఎస్ఐ ముత్తయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.