హైదరాబాద్: నటుడు మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులు..

హైదరాబాద్: నటుడు మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులు..

మోహన్ బాబుపై ఫిర్యాదు చేసిన కొడుకు మంచు మనోజ్.. తనను తండ్రి కొట్టాడని పీఎస్‌లో మంచు మనోజ్ ఫిర్యాదు..

మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై ఫిర్యాదు చేసిన మోహన్ బాబు..

స్కూల్, ఆస్తుల వ్యవహారంలో పరస్పర దాడులు.. గాయాలతో పీఎస్‌కు వచ్చి ఫిర్యాదు చేసిన మంచు మనోజ్.. తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేశారని మోహన్ బాబుపై ఫిర్యాదు..

ఈ మేరకు మోహన్ బాబుపై పహడి షర్రిఫ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మరోవైపు మనోజే తనపై దాడి చేశాడని మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్తులు, స్కూల్ వ్య‌వ‌హారంపై ఈ గొడవ‌లు జ‌రిగిన‌ట్లు తెలుస్తుంది. కాగా కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్యన మంచు విష్ణు, మనోజ్ ల మధ్య పెద్ద గొడవే జరిగింది. మంచు విష్ణు.. మనోజ్ ఇంటికి వచ్చి మరీ కొడతానని వార్నింగ్ ఇచ్చాడు. ఈ కారణంగానే మనోజ్ పెళ్లిలో ఎక్కువగా కనిపించలేదు మంచు విష్ణు. ఇప్పుడు ఏకంగా తండ్రీ కొడుకులు గొడవ పడడం సంచలనంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబును క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకుంటారు. అలాంటిది వారి కుటుంబంలోనే ఇలాంటి గొడవలు రేగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది..

అసత్యాలను ప్రచారం చేయవద్దు..

అయితే ఈ వార్తలను మోహన్ బాబు ఖండించారు.
ఈ వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. ‘మోహన్ బాబు , మంచుమనోజ్ పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో నిజం‌ లేదు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కధనాలను కొన్ని మీడియా చానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. ఎవిడెన్స్ లు లేకుండా
అసత్య ప్రచారాలను చేయకండి’ అని చెప్పుకొచ్చారు.