హైదరాబాద్‌తో పాటు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌లో (CURE) కొత్త బోర్వెల్ తవ్వకాలపై ప్రభుత్వం విధించిన కఠిన ఆంక్షలపై నివాసితులు, నిర్మాణదారులు, రిగ్ ఆపరేటర్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు 5 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు పడిపోవడంతో, జీవో 259 (GO 259) ద్వారా ప్రభుత్వం ఈ ఆంక్షలను 2027 జులై 31 వరకు అమల్లోకి తెచ్చింది.. దీంతో అత్యవసర తాగునీటి అవసరాలు, వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాలకు కొత్త బోర్లు వేసేందుకు అనుమతులు నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు….పాత బోర్ల మరమ్మతులు, సర్వీసింగ్ పనులకు వెళ్తున్న తమ వాహనాలను కూడా హైడ్రా (HYDRAA), రెవెన్యూ అధికారులు అన్యాయంగా సీజ్ చేస్తున్నారని తెలంగాణ రిగ్ ఓనర్స్ అసోసియేషన్ (TROA) ఆరోపించింది. దాదాపు 250 రిగ్ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు…..
నిర్మాణ పనులకు భూగర్భ జలాలకు బదులుగా శుద్ధి చేసిన మురుగునీటిని (STP water) గ్రీన్ ట్యాంకర్ల ద్వారా వాడాలన్న నిబంధనపై CREDAI, బిల్డర్ల సంఘాలు అభ్యంతరం తెలిపాయి. దీనివల్ల నిర్మాణ వ్యయం 2-3% పెరగడంతో పాటు, శుద్ధి చేసిన నీటి వల్ల సిమెంట్, స్టీల్ నాణ్యత దెబ్బతింటుందని వారు పేర్కొన్నారు….వాణిజ్య, భారీ నిర్మాణ అవసరాలకు అనుమతి లేకుండా కొత్త బోర్లు తవ్వితే వాల్టా (WALTA) చట్టం కింద రూ. 5 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా, రిగ్ వాహనాల సీజ్ వంటి చర్యలు కొనసాగుతాయని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజా తాగునీటి వనరులకు 250 మీటర్ల పరిధిలో బోర్లు వేయడంపై ఆంక్షలు యథాతథంగా ఉన్నాయి.