హైదరాబాద్: ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ప్రారంభం.
ఇబ్రహీంపట్నంలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఆఫీస్
ప్రారంభించిన ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్బాబు
ఫ్యూచర్ సిటీ పరిధిలో 22 పోలీస్స్టేషన్లు
మూడు జోన్లు, ఆరు సబ్ డివిజన్లు..
మరింత పటిష్టం చేసేందుకు పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేసింది. ప్రస్తుతం ఉన్న మూడు కమిషనరేట్లకు అదనంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ కోసం ప్రత్యేకంగా నాలుగో కమిషనరేట్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాలన్నింటినీ జీహెచ్ఎంసీలో విలీనం చేసిన నేపథ్యంలో.. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా పోలీసు శాఖలో ఈ భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.