హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో వర్ష బీభత్సం…!

హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో సాయంత్రం వర్ష బీభత్సం.. డ్రైనేజీ నీళ్లు పొంగి, బైకులు కూడా కొట్టుకుపోతున్నాయి..

కుండ‌పోత వ‌ర్షం ధాటికి న‌గ‌రంలోని అమీన్‌పూర్‌, రాయ్‌దుర్గ్, ఖైర‌తాబాద్‌, కూక‌ట్ ప‌ల్లి, లింగంప‌ల్లి, మియాపూర్, ముషీరాబాద్‌, ల‌క్డీకాపూర్‌, స‌రూర్ న‌గ‌ర్, కోఠి, అబిడ్స్, బ‌షీర్ బాగ్‌, హిమాయ‌త్ న‌గ‌ర్‌, ట్యాంక్ బండ్‌, నారాయ‌ణ‌గూడ‌తోపాటు ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి… హైద‌రాబాద్‌లోని చాలా ప్రాంతాలను ఇప్ప‌టికే తొలక‌రి వ‌ర్షం ప‌లుక‌రించింద‌ని తెలిసిందే. తాజాగా హైద‌రాబాద్‌లో వాతావ‌ర‌ణం ఒక్కసారిగా చ‌ల్ల బ‌డ్డ‌ది. న‌గ‌ర‌వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. కుండ‌పోత వ‌ర్షం ధాటికిన‌గ‌రంలోని అమీన్‌పూర్‌, రాయ్‌దుర్గ్, ఖైర‌తాబాద్‌, కూక‌ట్ ప‌ల్లి, లింగంప‌ల్లి, మియాపూర్, ముషీరాబాద్‌, ల‌క్డీకాపూర్‌, స‌రూర్ న‌గ‌ర్, కోఠి, అబిడ్స్, బ‌షీర్ బాగ్‌, హిమాయ‌త్ న‌గ‌ర్‌, ట్యాంక్ బండ్‌, నారాయ‌ణ‌గూడ‌తోపాటు ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి..భారీ వ‌ర్షంతో కొన్ని చోట్ల‌ ట్రాఫిక్ స్తంభించి రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు వాహ‌న ర‌ద్దీని క్లియ‌ర్ చేస్తున్నారు. ముషీరాబాద్‌లో ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంతరాయం ఏర్పడింది. రామ్ న‌గ‌ర్‌లోని వీఎస్టీ రోడ్డులో భారీ వృక్షం నేల‌కొరిగింది. మ‌రోవైపు హైద‌ర్‌గూడ‌లో మరో వృక్షం నేల‌కొరిగింది. ఇప్ప‌టికే రాష్ట్రంలోని ప‌లుజిల్లాల్లో నేడు, రేపు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది..